అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి! వారే చేసుంటారని అనుమానం!

Header Banner

అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి! వారే చేసుంటారని అనుమానం!

  Tue Sep 17, 2024 11:24        U S A

అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.న్యూయార్క్ లోని మెల్విల్లేలో ఉన్న 'BAPS స్వామినారాయణ్ దేవాలయం'పై ఆదివారం రాత్రి దుండగులు దాడి చేశారు.ఈ దాడిలో టెంపుల్ లోని ఓ భాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం గోడలపై 'మోడీ టెర్రరిస్ట్, మోడీ ముర్దాబాద్' అంటూ రాతలు రాశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. క్వాడ్ సమ్మిట్ కోసం మోడీ సెప్టెంబర్ 20న US పర్యటనకు వెళ్లనున్నారు. క్వాడ్ సదస్సు జరిగే ప్రాంతానికి కొద్దీ దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత్పై వ్యతిరేకతతో ఖలిస్థానీ ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

 

ఇంకా చదవండిఉచిత ఇసుక సౌకర్యంలో కొత్త ఒరవడి! ఆ రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం! డోర్ డెలివరీకి ముహూర్తం ఫిక్స్! 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇదిలా ఉంటే.. స్వామినారాయణ్ టెంపుల్ పై జరిగిన దాడిని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. స్వామినారాయణ దేవాలయాన్ని విధ్వంసం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారిపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని అక్కడి పోలీసులను డిమాండ్ చేసింది. మరోవైపు న్యూయార్క్లోని BAPS హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై దర్యాప్తు జరిపించాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ అమెరికా న్యాయ శాఖను కోరింది. న్యూయార్క్ దేవాలయంపై జరిగిన విధ్వంస ఘటన కాలిఫోర్నియా, కెనడా లో జరిగిన దేవాలయాలపై జరిగిన దాడులకు సమానమని 'X' లో పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్తవెంటనే అప్లై చేసుకోండిలా!

 

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ! 

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants