బుడమేరులో వరద ఉద్ధృతి పై మంత్రి లోకేశ్ సమీక్ష! సీపేజ్ తగ్గించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు!

Header Banner

బుడమేరులో వరద ఉద్ధృతి పై మంత్రి లోకేశ్ సమీక్ష! సీపేజ్ తగ్గించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు!

  Mon Sep 09, 2024 16:30        Politics

అమరావతి : బుడమేరుకు వస్తున్న వరద ఉద్ధృతిపై మంత్రి నారా లోకేశ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతమయ్యేలా లోకేశ్ చర్యలు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట సీపేజ్ లీకేజీ 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు వరద నీరు తగ్గిందన్నారు. పూర్తి స్థాయిలో లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో లీకేజీని అరికట్టేందుకు జియో మెంబ్రేన్ షీట్ వినియోగిస్తున్నారు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో లీకేజీని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.


ఇంకా చదవండిఅదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నంవిజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!


వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే గండ్లు పడిన చోట 5.7 మీటర్ల ఎత్తు పెంపును చేపట్టగా.. మరో 0.3 మీటర్ల ఎత్తుకు పెంచితే ప్రస్తుత కట్ట స్థాయికి పనులు పూర్తి అవుతాయి. ఎప్పటికప్పుడు బుడమేరు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులతో లోకేశ్ సంప్రదింపులు జరుపుతున్నారు. మరోపక్క వరద బాధితులకు అందుతున్న సహాయం, నష్ట పరిహారం అంచనాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నష్ట పరిహార అంచనా పక్కాగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 36 మంది ప్రజాప్రతినిధులను నష్టం అంచనా పర్యవేక్షణకు నియమించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలాభారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీతెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #todaynews #flashnews #latestupdate #flods #naralokesh #budameru