పాముకాటుతో ఒకే కుటుంబంలో విషాదం! ముగ్గురు చిన్నారుల మృతి! తండ్రి కోసం పోరాటం!

Header Banner

పాముకాటుతో ఒకే కుటుంబంలో విషాదం! ముగ్గురు చిన్నారుల మృతి! తండ్రి కోసం పోరాటం!

  Mon Sep 09, 2024 17:20        India

భువనేశ్వర్: దేశంలో పాము కాటు (Snakebite) మరణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఒకే కుటుంబంలో ముగ్గురు బాలికలు పాముకాటుకు బలవ్వగా.. వారి తండ్రి ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాదకర ఘటన ఒడిశా (Odisha)లోని బౌధ్ జిల్లాలో చోటుచేసుకుంది.
బౌధ్ జిల్లా చరియాపలి గ్రామానికి చెందిన శాలేంద్ర మల్లిక్ కుటుంబం ఆదివారం రాత్రి ఇంట్లో నేలపై నిద్రించింది. అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి మల్లిక్, ఆయన ముగ్గురు కుమార్తెలకు ఏదో కుట్టినట్లు నొప్పిగా అనిపించి ఉలిక్కిపడి లేచారు. పక్కన పాము (Snake) వెళ్తుండటాన్ని చూసిన శాలేంద్ర కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు. స్థానికుల సాయంతో వెంటనే ఆ నలుగురిని ఆసుపత్రికి తరలించారు.


ఇంకా చదవండిఅదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నంవిజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!



కొద్ది సేపటికే చికిత్స పొందుతూ ముగ్గురు చిన్నారులు స్మృతిరేఖ (12), శుభరేఖ (9), సురభి (3) ప్రాణాలు కోల్పోయారు. తండ్రి శాలేంద్ర పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. చిన్నారుల తల్లి, సోదరుడు పాము కాటు నుంచి తప్పించుకున్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాములు వీరిని కరిచి ఉంటాయని అనుమానిస్తున్నారు.
ఏటా మన దేశంలో పాము కాటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒడిశాలో గత ఏడేళ్లలో వీటి కారణంగా 5 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 50వేల మంది పాము కాటుకు బలవుతున్నట్లు ఆ మధ్య కేంద్రం లోక్సభలో వెల్లడించింది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలాభారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీతెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #bhuvaneswar #snakebite #odisha #todaynews #flashnews #latestupdate