భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు! కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!

Header Banner

భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు! కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!

  Mon Sep 09, 2024 21:00        Health

భారత్‌లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని వెల్లడించింది. ఆదివారం అనుమానిత కేసుగా భావించిన వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయిందని, నమూనాలను సేకరించి పరీక్షించినట్టు వివరించింది. ప్రయాణ సమయంలో సోకిన కేసుగా నిర్ధారించినట్టు పేర్కొంది. నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా రోగిలో పశ్చిమ ఆఫ్రికా క్లాడ్-2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. 

 

ఇంకా చదవండిగవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం చంద్రబాబు! వరద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరణ! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఈ ఎంపాక్స్ కేసు నిర్ధారణపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. బాధితుడు ఒక యువకుడు అని, ఎంపాక్స్ వ్యాప్తిని ఎదుర్కొంటున్న ఒక దేశానికి ఇటీవల ప్రయాణించాడని పేర్కొంది. మూడంచెల సంరక్షణ సదుపాయాలు ఉన్న ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, బహుళ అనారోగ్య సమస్యలు ఏమీ ఉత్పన్నం కాలేదని వివరించింది. కాగా రోగి పేరును కేంద్రం వెల్లడించలేదు. 

 

ఇంకా చదవండిజగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

దేశంలో గతంలో నమోదైన మంకీపాక్స్ కేసుల మాదిరిగా ఇది కూడా ఐసోలేట్ కేసు అని, హెల్త్ ఎమర్జెన్సీ అవసరం లేదని తెలిపింది. జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, ఇది కూడా వాటి మాదిరేనని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ కేసు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలో భాగం కాదని తెలిపింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Health #MonkeyPox #AndhraPradesh #India #MPox