ఎట్టకేలకు 42 రోజుల తర్వాత! విధుల్లోకి చేరిన కోల్‌కతా వైద్యులు!

Header Banner

ఎట్టకేలకు 42 రోజుల తర్వాత! విధుల్లోకి చేరిన కోల్‌కతా వైద్యులు!

  Sat Sep 21, 2024 14:24        India

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనపై గత 42 రోజులుగా నిరసనను చేపడుతున్న అక్కడి జూనియర్‌ డాక్టర్లు ఎట్టకేలకు తమ విధుల్లోకి చేరారు. తమ డిమాండ్లను నెరవేర్చుతామని మమతా బెనర్జీ సర్కార్‌ అంగీకరించిన నేపథ్యంలో పాక్షికంగా సమ్మెను విరమిస్తున్నట్టు గురువారం రాత్రి వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ వారు తమ విధుల్లోకి చేరారు.

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉదయం జూనియర్‌ వైద్యులు పాక్షికంగా తమ విధుల్లోకి చేరారు. అయితే అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరయ్యారు. ఔట్‌ పేషెంట్‌ విభాగం (ఓపీడీ)లో విధులకు మాత్రం దూరంగా ఉన్నారు. ‘మేము ఇవాళ పాక్షికంగా మా విధుల్లోకి చేరాం. మా సహోద్యోగులు ఈ ఉదయం నుంచి అత్యవసర సేవల్లో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు’ అని ఓ వైద్యుడు తెలిపారు. హత్యాచార ఘటనపై తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కాగా, వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ 40 రోజులుకుపైగా కోల్‌కతా వైద్యులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైద్యుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది. ఈ క్రమంలో రెండు దఫాలుగా వైద్యులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలో వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు సీఎం మతమతా బెనర్జీ అంగీకారం తెలిపారు. 

 

ఇంకా చదవండి: మద్దిరాలపాడులో సీఎం చంద్రబాబు పర్యటన! అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!

 

ఇందులో భాగంగానే కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌గా వినీత్‌ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్‌ కుమార్‌ వర్మను నియమించారు. అదేవిధఃగా మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కౌస్తవ్‌ నాయక్‌, హెల్త్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ దేవాశిష్‌ హల్దేర్‌లపై కూడా వేటు వేశారు. ఆ తర్వాత రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్‌తో వైద్యులు బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆందోళన విరమిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. పాక్షికంగా సమ్మెను విరమిస్తున్నట్టు గురువారం రాత్రి ప్రకటించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా! 

 



   #AndhraPravasi #India #WestBengal #RGKARHospital #Kolkata