అత్యంత శక్తిమంతులైన ముఖ్యమంత్రులలో చంద్రబాబు నంబర్ వన్! టాప్‌ టెన్‌ నేతల్లో ఇంకా ఎవరెవరున్నారు తెలుసుకోండి!

Header Banner

అత్యంత శక్తిమంతులైన ముఖ్యమంత్రులలో చంద్రబాబు నంబర్ వన్! టాప్‌ టెన్‌ నేతల్లో ఇంకా ఎవరెవరున్నారు తెలుసుకోండి!

  Wed Nov 13, 2024 08:53        Politics

ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా శక్తిమంతులైన టాప్‌ టెన్‌ నేతల్లో చంద్ర‌బాబు ఐదో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఆయనకు ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు.. ఇక అత్యంత శ‌క్తిమంతులైన సీఎంల‌లో చంద్ర‌బాబు తర్వాత బీహార్‌, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రులు నితీశ్‌కుమార్‌, యోగి ఆదిత్యనాథ్‌, ఎంకే స్టాలిన్‌, మమతాబెనర్జీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఉన్నారు. జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్‌ పక్షిలా పునర్జన్మ ఎత్తి.. అధికారం చేజిక్కించుకున్నారని ‘ఇండియా టుడే’ క‌థ‌నం అభివ‌ర్ణించింది. హాలీవుడ్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చరిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని ప్ర‌శంసించింది. ప్ర‌స్తుతం భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని పేర్కొంది. అలాగే జనసేన, బీజేపీతో కూట‌మిగా ఏర్ప‌డి టీడీపీని పతనావస్థ నుంచి విజయతీరానికి చేర్చారని మంగళవారం నాటి త‌న‌ ప్రత్యేక కథనంలో చంద్ర‌బాబుకు ‘ఇండియా టుడే’ కితాబిచ్చింది. ఇవాళ చంద్రబాబు భారత్‌లోనే అత్యంత సీనియర్ సీఎం అని తెలిపింది. "ప్ర‌స్తుతం కేంద్రంలో చంద్ర‌బాబు చ‌క్రం తిప్పుతున్నారు.

 

ఇంకా చదవండి: RRR ను డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించిన కూటమి! ఈ రోజు లాంఛనం గా ఎన్నిక!

 

లోక్‌సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సంక‌టం త‌ప్ప‌దు. అందుకే పాలక ఎన్‌డీఏలో ఆయ‌న కీల‌కం అయ్యారు. నాలుగోసారి సీఎం అయిన చంద్ర‌బాబు.. తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చాలా ఈజీగా చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల విజన్‌-2047 డాక్యుమెంట్‌ ఆవిష్కరించారు. 15 శాతం వృద్ధి రేటుతో 2047 కల్లా ఆంధ్ర ఎకానమీని 2.4 ట్రిలియన్‌ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్‌ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారు. ఇక కార్పొరేట్లతో స్నేహ‌భావంతో మెలిగే చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి ముఖ్య‌మంత్రి అయిన సంద‌ర్భంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజనెస్ (ఐఎస్‌బీ) ఏర్పాటుకు చొరవ చూపించారు" అని ‘ఇండియా టుడే’ త‌న కథనంలో రాసుకొచ్చింది.

 

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులు, సీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews