వైసీపీ ఎమ్మెల్సీ బంధువులు మా భూమి కబ్జా చేశారు! జనవాణిలో బాధితుల అర్జీలు!

Header Banner

వైసీపీ ఎమ్మెల్సీ బంధువులు మా భూమి కబ్జా చేశారు! జనవాణిలో బాధితుల అర్జీలు!

  Wed Nov 13, 2024 22:17        Politics

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అండతో అతని బంధువు మా ఇళ్ల స్థలం కబ్జా చేశారు. మా తాత గారి పేరిట ఉన్న భూమిని లాక్కుని దుకాణ సముదాయం నిర్మించేశారు. ఏళ్ల తరబడి మా ఆస్తిని రాజకీయ పలుకుబడిని అడ్డుకుపెట్టుకుని అనుభవిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మా భూమిని మాకు ఇప్పించి న్యాయం చేయండి అంటూ బాధితులు జనవాణిలో అర్జీ సమర్పించారు. మైనర్ బాలికను బలాత్కారం చేసిన వ్యక్తిపై పోక్సో కేసు పెడితే బెయిల్ పై బయటికి వచ్చి బెదిరిస్తున్నాడు. గుడివాడకు చెందిన బాధితురాలి కుటుంబం జనసేన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మండలి రాజేష్, పార్టీ నాయకులతో కలసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించగా, రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు సమర్పించారు.

 

తూర్పు ఏజన్సీలో వైసీపీ ఎమ్మల్సీ అనుచరులు, బంధువుల అరాచకాలు అన్నీ ఇన్నీ కావని, గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కన్ను పడిన భూమిని కబ్జా చేసశారని రంపచోడవరం మండలం, అడ్డతీగల గ్రామానికి చెందిన శ్రీమతి కోదండ వాసవి అనే మహిళ జనవాణిలో ఫిర్యాదు చేశారు. తమ తాత గారి నుంచి తల్లికి సంక్రమించాల్సిన భూమిలో అనంతబాబు బందువు సూరపురెడ్డి సత్యనారాయణ దుకాణ సముదాయం నిర్మించేసి షాపులు అద్దెకు ఇచ్చుకొన్నదని, ఆ స్థలం మాది అని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. రాజకీయ పలుకుబడితో గత కొన్నేళ్లుగా మా భూమి అనుభవిస్తున్నాడని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని వాపోయారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గుడివాడకు చెందిన ఓ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్న బాలికపై అదే కళాశాలలో పని చేస్తున్న అన్నం సత్యనారాయణ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ట్యూషన్ పెరిట ఇంటికి పిలిపించుకుని బెదిరించి బలాత్కరించాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం కింద కేసు పెడితే బెయిల్ పై బయటకు వచ్చి బెదిరిస్తున్నాడు. గుడివాడ మాజీ ఎమ్మెల్సీ కొడాలి నాని అండదండలు పుష్కలంగా ఉండడంతో వెంటనే జైలు నుంచి బయటికి వచ్చాడని, అదే పలుకుబడి ఉపయోగించి లాయర్లను అడ్డుపెట్టుకుని కేసును రెండేళ్లుగా తాత్సారం చేయిస్తున్నారని ఆరోపిస్తూ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన బాధితురాలి తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు.

 

 

ఏడాది క్రితం అదృశ్యం అయిన తన తల్లి ఆచూకీ కోసం పోలీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయామని, పోలీసులను గట్టిగా అడిగితే స్థానిక వైసీపీ నేత పెద్ద మాతంగి రవికుమార్ చెరలో ఆమె ఉన్నట్టు వారి మాటల ద్వారా తెలిసిందని, కేసుపెడదామంటే వైసీపీ నాయకుడి కుటుంబ సభ్యులు ఎదురు తమపైనే దాడులకు పాల్పడుతున్నారని నంద్యాల జిల్లాకు చెందిన చెందిన శ్రీ అనపూరి పవన్ కళ్యాణ్ అనే యువకుడు జనవాణికి ఫిర్యాదు చేశాడు. సదరు వైసీపీ నేత చెర నుంచి తన తల్లిని విడిపించాలని, పోలీసులు అతనిపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరాడు. వీరితోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినవారు జనవాణిలో తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి శివపార్వతి, పార్టీ నాయకులు శ్రీ కొర్రపాటి నాగేశ్వరరావు, న్యాయ విభాగానికి చెందిన శ్రీ కప్పెర కోటేశ్వరరావు, శ్రీమతి సూరిశెట్టి కల్పన పాల్గొన్నారు.

WhatsApp Image 2024-11-13 at 8.09.20 PM.jpeg

 

WhatsApp Image 2024-11-13 at 8.09.20 PM (1).jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP