ఓబుళాపురం గనుల వివాదం..తవ్వకాలపై గడువు విధించిన సుప్రీంకోర్టు! ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు!

Header Banner

ఓబుళాపురం గనుల వివాదం..తవ్వకాలపై గడువు విధించిన సుప్రీంకోర్టు! ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు!

  Wed Nov 13, 2024 09:49        Others

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లోని ఓబుళాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలపై అఫిడవిట్ దాఖలుచేయడానికి సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు నాలుగువారాల గడువు ఇచ్చింది. జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్పీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతర్రాష్ట్ర వివాదంపై సర్వే జనరల్ విచారణ జరిపి ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో సరిహద్దులు నిర్ధారించడంపై తమ విధానాన్ని వెల్లడించడానికి సమయం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమయం కోరినందున అఫిడవిట్ దాఖలుకు నాలుగు వారాల సమయం ఇస్తున్నట్లు జస్టిస్ హృషికేశ్ రాయ్ స్పష్టం చేశారు. వై. మహాబలేశ్వరప్ప కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది సింగ్ వాదనలు వినిపిస్తూ తమ గనుల్లో పెద్దగా ఉల్లంఘనలు జరగలేదని ఇదివరకు సీఈసీ చెప్పిందని పేర్కొన్నారు.


ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14



గనుల లీజు గడువు 2028తో ముగస్తుందని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా తాము 2010 నుంచి తవ్వకాలు చేపట్టలేక పూర్తిగా నష్టపోయామని చెప్పారు. సీఈసీ మిగిలిన మైనింగ్ లీజులను రద్దుచేయాలని సిఫార్సు చేసినా, తమ లీజుల రద్దుకు సిఫార్సు చేయలేదని, అందువల్ల ఇప్పటికైనా తమకు తవ్వకాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. జస్టిస్ ఎస్పీఎన్ భట్ జోక్యం చేసుకుంటూ ఈ విషయంలో తొలుత అన్ని అధీకృత సంస్థల అభిప్రాయాలు తెలుసుకోనివ్వాలని పేర్కొన్నారు. అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాక.. అఫిడవిట్ల దాఖలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగువారాల సమయం ఇస్తున్నట్లు జస్టిస్ హృషికేశ్ రాయ్ వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #iron #mining #offidavit #supremecourt #todaynews #flashnews #latestupdate