ఖ‌ర్జూరాల‌ను తింటే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు! ఎలాగో తెలుసా?

Header Banner

ఖ‌ర్జూరాల‌ను తింటే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు! ఎలాగో తెలుసా?

  Thu Nov 14, 2024 11:06        Health

ఖ‌ర్జూరాల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిల్లో స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌ల ఉంటాయి. అలాగే ఫైబ‌ర్ కూడా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తింటే మ‌న‌కు పోష‌ణ ల‌భిస్తుంది. ఖ‌ర్జూరాలు రుచికి చాలా తియ్య‌గా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ వీటిని తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు కానీ పెర‌గ‌రు. ఖ‌ర్జూరాల‌ను రోజూ మోతాదులో తింటే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది. వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. ఖ‌ర్జూరాల్లో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది సాల్యుబుల్ ఫైబ‌ర్‌. అందువ‌ల్ల జీర్ణ‌క్రియ‌ను నెమ్మ‌దింప‌జేస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీని వ‌ల్ల ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. త‌క్కువ ఆహారం తింటారు. ఫ‌లితంగా ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. క‌నుక అధిక బ‌రువు ఉన్న‌వారు రోజూ ఖ‌ర్జూరాల‌ను తింటే త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంది.

 

స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు..
ఖ‌ర్జూరాల్లో స‌హ‌జసిద్ధ‌మైన చ‌క్కెర‌లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్ర‌క్టోజ్‌, గ్లూకోజ్‌, సూక్రోజ్ అనే స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. సాధార‌ణ చ‌క్కెర క‌న్నా ఈ చ‌క్కెర‌లు ర‌క్తంలో నెమ్మ‌దిగా క‌లుస్తాయి. క‌నుక స్వీట్ల‌ను తినాల‌నే ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు ఖ‌ర్జూరాల‌ను తిన‌డం మేలు. దీంతో తీపి తిన్న భావ‌న క‌లుగుతుంది. ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం ప‌డ‌దు. అలాగే క్యాల‌రీలు అధికంగా చేర‌కుండా చూసుకోవ‌చ్చు. దీంతో బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. 

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

ఖ‌ర్జూరాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ముఖ్యంగా బి విట‌మిన్లు, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నిషియం స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మెట‌బాలిజం పెరిగేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీని వ‌ల్ల క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. దీంతో బ‌రువు త‌గ్గుతారు. 

 

షుగర్ ఉన్న‌వారు కూడా..
ఖర్జూరాలు తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ మోతాదులోనే ఉంటుంది. వీటిని తింటే అంత వేగంగా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌వు. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు కూడా మోతాదులో ఖ‌ర్జూరాల‌ను తిన‌వ‌చ్చు. బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు స్నాక్స్ తినే బ‌దులు నాలుగు ఖ‌ర్జూరాల‌ను తింటే ఆక‌లి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. దీంతో చిరుతిళ్ల‌ను తిన‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. అలాగే బ‌రువు నియంత్ర‌ణలో ఉంటుంది. 

 

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు..
ఖ‌ర్జూరాల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది. దీంతో సుఖ విరేచ‌నం అవుతుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఎంత‌గానో ఫ‌లితం ఉంటుంది. ఖ‌ర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫినోలిక్ యాసిడ్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో శ‌రీరంలోని టాక్సిన్లు బ‌య‌ట‌కు పోతాయి. ఫ‌లితంగా శ‌రీరం శుభ్రంగా మారుతుంది. దీంతోపాటు కొవ్వు కూడా క‌రుగుతుంది. ఇలా ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే బ‌రువును కూడా త‌గ్గించుకోవ‌చ్చు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!

 

వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?

 

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #AndhraPravasi #Health #Foods #Dates #Diet #Weight