గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
Fri Nov 15, 2024 07:00 Politicsఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి చంద్రబాబు నిర్ణయించారు. కీలక అంశాల పై నిర్ణయంతో సహా పలు రాటిఫికేషన్లను ఆమోదం తెలపనున్నారు. అదే విధంగా వాలంటీర్లు, 108 ఉద్యోగుల అంశం, పథకాల అమలు పైన నిర్ణయం తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో అసభ్య సందేశాల నిరోధానికి ప్రత్యేకంగా తీసుకొచ్చే చట్టానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ప్రత్యేకంగా ఈ భేటీకి నిర్ణయించారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ కొనసాగనుంది. సభలో ఆమోదించాల్సిన బిల్లుల పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి వీలుగా ప్రత్యేక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందు కోసం కొత్త చట్టం తీసుకురావటం తో పాటుగా ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మహిళలను కించ పరిచేలా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలకు వీలుగా ఈ చట్టం తీసుకురానున్నారు.
ఇంకా చదవండి: వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
ఇక, పెండింగ్ లో ఉన్న పలు అంశాల పైన మంత్రివర్గం చర్చించనుంది. వాలంటీర్ల కొనసాగింపు అంశం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. అయిదు నెలలుగా వారికి విధులు కేటాయించ లేదు. వేతనాలు ఇవ్వలేదు. బడ్జెట్ లోనూ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా సూపర్ సిక్స్ హామీల పై వైసీపీ విమర్శలు చేస్తున్న సమయం లో ప్రభుత్వం వీటి అమలుకు వీలుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. బడ్జెట్ లో రైతులకు రూ 20 వేలు, అమ్మకు వందనం కు నిధులు కేటాయించింది. అయితే, పూర్తి స్థాయిలో అమలుకు వీలుగా ఆ కేటాయింపులు లేవని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో, జనవరిలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో రూ 20 వేల జమ పైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పథకాల అమలుతో పాటుగా అమ్మకు వందనం అమలు ముహూర్తం పైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.