శబరిమలకు పోటెత్తిన భక్తులు! 9 రోజుల్లో రూ.41 కోట్ల ఆదాయం! దర్శనానికి 10 గంటల సమయం!

Header Banner

శబరిమలకు పోటెత్తిన భక్తులు! 9 రోజుల్లో రూ.41 కోట్ల ఆదాయం! దర్శనానికి 10 గంటల సమయం!

  Mon Nov 25, 2024 12:30        Devotional

శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మండల దీక్ష చేసిన అయ్యప్ప దీక్షా స్వాములతోపాటు వేలాదిగా భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మాలధారులు రావడంతో స్వామివారి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 

ఇంకా చదవండి25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
 

మండల – మకరవిళక్కు సీజన్‌లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఆరు లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్థానం బోర్డు ట్రావెన్‌కోర్‌ దేవస్వాం తెలిపింది. నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా, ఈ తొమ్మిది రోజుల్లోనే 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్‌లో కేవలం 3,03,501 మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపింది. పోలీసుల ముందస్తు చర్యలతో ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులు ఆలయంలోకి పవిత్రమైన పడి మెట్లను ఎక్కగలుగుతున్నారని పేర్కొంది. 

 

ఇంకా చదవండినయనతారకు ఇదో పెద్ద అవమానమే! బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో..వీడియో నెట్టింట వైరల్‌! 

 

మరోవైపు భక్తుల రద్దీ పెరగడంతోపాటు ఆదాయం కూడా భారీగా సమకూరినట్లు దేవస్థానం బోర్డు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో రూ.28.3 కోట్లు ఆదాయం రాగా.. ఈ సారి అది రూ.41.64 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.13.33 కోట్ల ఎక్కువ అని వెల్లడించింది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వండిపెరియార్‌ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్‌లైన్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దర్శనం లేకుండా ఏ భక్తుడు కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి లేదని అన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

 

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

 

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

 

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 



   #AndhraPravasi #Devotional #Sabarimala #Kerala #Government #Insurance