ద‌క్షిణ కొరియాలో రెండో రోజు భారీగా మంచు! 120 ఏళ్ల రికార్డు బ్రేక్‌!

Header Banner

ద‌క్షిణ కొరియాలో రెండో రోజు భారీగా మంచు! 120 ఏళ్ల రికార్డు బ్రేక్‌!

  Thu Nov 28, 2024 20:33        Others

ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్ న‌గ‌రంలో.. వ‌రుస‌గా రెండో రోజు తీవ్ర స్థాయి హిమ‌పాతం కురిసింది. దీంతో ఆ న‌గ‌రం అంతా మంచు దుప్ప‌టి ప‌రిచిన‌ట్లు అయ్యింది. డ‌జ‌న్ల సంఖ్య‌లో విమానాల‌ను ర‌ద్దు చేశారు. బోట్లు కూడా ర‌ద్దు అయ్యాయి. చ‌లి తీవ్ర‌త త‌ట్టుకోలేక క‌నీసం అయిదు మంది మృతిచెంది ఉంటార‌ని భావిస్తున్నారు. గ‌డిచిన శ‌తాబ్ధ కాలంలో ఇంత భారీ స్థాయిలో హిమ‌పాతం కుర‌వ‌డం ఇది మూడోసారి. రికార్డుల ప్ర‌కారం 1907 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మూడుసార్లు మాత్ర‌మే సియోల్‌లో ఈ స్థాయిలో మంచు కురిసింది.

 

ఇంకా చదవండిఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

సియోల్ న‌గ‌రంలోని అనేక ప్రాంతాల్లో సుమారు 40 సెంటీమీట‌ర్ల మేర మంచు పేరుకుపోయింది. దీంతో దాదాపు 140 విమానాల‌ను ర‌ద్దు చేశారు. గ్యాంగ్వాన్ ప్రావిన్సులోని వోంజు న‌గ‌రంలో సుమారు 53 వాహ‌నాలు ఒక‌దాన్ని ఒక‌టి ఢీకొన్నాయి. ఆ ఘ‌ట‌న‌లో 11 మంది గాయ‌ప‌డ్డారు. సియోల్‌లోని ప్ర‌ధాన విమానాశ్ర‌యం ఇంచియాన్‌లో రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. విమానాలు దాదాపు రెండు గంట‌ల పాటు ఆల‌స్యంగా న‌డిచాయి. గియాంగి ప్రావిన్సులో ఉన్న వంద‌లాది స్కూళ్ల‌ను మూసివేశారు. పొరుగుదేశ‌మైన ఉత్త‌ర కొరియాలో కూడా తీవ్ర స్థాయిలో మంచు కురిసింది. సుమారు 10 సెంటీమీట‌ర్ల మేర మంచు పేరుకుపోయింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



   #AndhraPravasi #SouthKorea #Environment #Snow #Seoul