జనవరి 2025 నుండి UK వీసా కొత్త ఫీజులు అమలులోకి! పూర్తి వివరాలు మీకోసం!

Header Banner

జనవరి 2025 నుండి UK వీసా కొత్త ఫీజులు అమలులోకి! పూర్తి వివరాలు మీకోసం!

  Mon Dec 23, 2024 11:49        Europe

బ్రిటీష్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పొందడం లేదా యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్లాన్ చేస్కుంటున్నారా... నూతన సంవత్సరం నుండి ఈ ఖర్చులు పెరగనున్నాయి. జనవరి 2025 నుండి, భారతదేశం నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌కు చదువుకోవాలని లేదా వలస వెళ్లాలని ప్లాన్ చేసుకునే వ్యక్తులు ప్రస్తుత అవసరాల కంటే కనీసం 11 శాతం ఎక్కువ ఆర్థిక నిల్వలను ప్రూఫ్ గా చూపించవల్సి ఉంటుంది. UKలో చదువుకోవడానికి లేదా పని చేయడానికి దరఖాస్తు చేసుకునే వారికి వర్తించే కొత్త రూల్స్ UK ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

 

విద్యార్థులకు అవసరాలు
జనవరి 2 నుండి, UK స్టడీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అంతర్జాతీయ విద్యార్థులు జీవన వ్యయాలను కవర్ చేయడానికి తగినన్ని నిధులకు సంబంధించిన సాక్ష్యాలను చూపవలసి ఉంటుంది:
లండన్‌ సిటీలోని కోర్సులకు నెలకు £1,483 (రూ. 1.5 లక్షలు).
లండన్ సిటీ బయట కోర్సులకు నెలకు £1,136. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఒక-సంవత్సరం మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం మీ అకౌంటు లో లండన్‌ సిటీలో అయితే £13,347 (రూ. 14 లక్షలు) మరియు లండన్ సిటీ బయట అయితే £10,224 మొత్తం ఉండాలి. వీసా దరఖాస్తును సమర్పించే ముందు కనీసం 28 రోజుల పాటు ఈ నిధులు తప్పనిసరిగా ఉంచాలి. ప్రస్తుతం, జీవన వ్యయం అవసరాలు లండన్‌కు నెలకు £1,334 మరియు ఇతర ప్రాంతాలకు నెలకు £1,023 ఖర్చు అవుతుంది. 

 

స్కిల్డ్ వర్కర్ వీసా అవసరాలు
మొదటి సారి దరఖాస్తు చేసుకునే స్కిల్డ్ వర్కర్ లు జీవన వ్యయాలు మరియు వసతి కోసం కనీసం £38,700 ఆదాయాన్ని తమ అకౌంటులో చూపించాలి. వారు హోం ఆఫీస్ ద్వారా ఆమోదించబడిన UK యజమాని నుండి స్పాన్సర్‌షిప్‌ను కూడా కలిగి ఉండాలి. 

 

ఫీజుల పెంపు
పర్యాటక, కుటుంబం, జీవిత భాగస్వామి, చైల్డ్ మరియు విద్యార్థి వీసాలతో సహా వివిధ వర్గాలలో వీసా దరఖాస్తు రుసుము స్వల్పంగా పెరుగుతుంది. ఏదేమైనప్పటికీ, వికలాంగులు, సంరక్షకులు మరియు ఆరోగ్య సంరక్షణ, సాయుధ దళాలు మరియు నిర్దిష్ట ప్రతిభ ఆధారిత పాత్రలు వంటి నిర్దిష్ట రంగాలలో పనిచేస్తున్న వారికి మినహాయింపులు ఉంటాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

 

ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!

 

దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!

 

డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Europe #UK #UnitedKingdom #UKNews #UKElections #UKUpdates