మరో ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! 200 గ్రామాలకు ఈ సౌకర్యం - ఇక వారు ఎగిరి గంతేయాల్సిందే!

Header Banner

మరో ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! 200 గ్రామాలకు ఈ సౌకర్యం - ఇక వారు ఎగిరి గంతేయాల్సిందే!

  Fri Dec 27, 2024 10:00        Politics

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రస్తుతం రైళ్లకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఈ మార్గం కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. రద్దీని నియంత్రించలేక కొన్ని రైళ్లను అధికారులు నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా నడిపిస్తున్నారు. టికెట్లు దొరకడం గగనం అవుతోంది. విశాఖపట్నం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైస్పీడ్ ట్రాక్ కోసం సర్వే జరుగుతోంది. తాజాగా భద్రాచలం రోడ్డు నుంచి ఏపీలోని కొవ్వూరుకు నిర్మించే రైల్వేలైనుకు కేంద్రం పచ్చజెండా ఊపించింది. దీనివల్ల విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. విజయవాడ స్టేషన్ కు వచ్చే అవసరం లేకుండా కొన్ని రైళ్లు నేరుగా ఈ మార్గంలో ప్రయాణించి కాజీపేట మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2155 కోట్లు కాగా 119 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను నిర్మిస్తారు.

 

ఇంకా చదవండి: ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఇందులో 50 శాతం ఖర్చును చంద్రబాబు ప్రభుత్వం భరిస్తోంది. వాస్తవానికి ఈ లైను నిర్మాణంపై 1970 నుంచి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. సర్వేల పేరుతో కోట్లరూపాయలు మాత్రం ఖర్చుపెట్టారు. ఈ రైల్వే లైను నిర్మాణం వల్ల బొగ్గు రవాణా సులభం అవుతుంది. కొత్తగూడెం-సత్తుపల్లి మధ్య ఇప్పటికే 57 కిలోమీటర్ల రైల్వే లైను అందుబాటులో ఉంది. 2022లో రూ.990 కోట్లతో ఈ ట్రాక్ నిర్మాణం పూర్తయింది. విశాఖ, కాకినాడ పోర్టు నుంచి నాగ్ పూర్, భోపాల్ వైపు సరకు రవాణా చేయడానికి ఈ మార్గం చాలా వీలు కల్పిస్తుంది. ఏపీ, తెలంగాణలోని గిరిజన ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు రైళ్లు అందుబాటులోకి వస్తాయి. దాదాపు 200 గ్రామాలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దాదాపు ఐదు సంవత్సరాల సమయంలో దీన్ని పూర్తిచేస్తారు. మూడు సంవత్సరాల్లోగా పూర్తిచేయాలని చంద్రబాబు ప్రభుత్వం కోరుతోంది. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ప్రాజెక్టు మంజూరు చేసినందుకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల జాబితా సిద్దం! మూడు పార్టీల నుంచి పదవులు ఎవరికంటే? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం ఎప్పుడంటే?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!

 

రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!

 

నేడు (26/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

 

తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

 

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli