సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం! అతిరుద్ర మహాయాగం!
Fri Dec 27, 2024 22:24 Singaporeలోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో వందేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ శతాబ్దిక (1924 -2024 ) వార్షికోత్సవము సందర్భముగా నిర్వహించిన అతిరుద్ర మహాయాగము మార్గశిర కృష్ణ షష్ఠి 21-12-2024 నుండి కృష్ణ ఏకాదశి 26-12-2024 వరకు 6 రోజుల పాటు ఘనంగా పిజిపి హాల్, పెరుమాళ్ దేవాలయ ప్రాంగణములో నిర్వహించింది. గత 5 రోజులనుంది అత్యంత విశేష ముగా జరుగుతూ కృష్ణ ఏకాదశి 26-12-2024 రోజు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. సభ నిర్వహించిన అతి రుద్రం కార్యక్రమం ఇది మొదటిది మరియు సింగపూర్‌లో రెండవది. సింగపూర్‌లో మొట్టమొదటి మహారుద్రం సభ 80వ వార్షికోత్సవాలలో భాగంగా 2004లో నిర్వహించిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భముగా కార్యక్రమము లో ఏర్పాటు చేసిన మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీల లోహిత, ఈశాన, విజయ, భీమ, దేవ దేవ, భవోద్భవ, ఆదిత్యమఖ మొదలైన ఏకాదశ(11) కలశ రుద్రఘన మండపముల వద్ద 121 ఋత్విక్యరేణ్యులు ఏక కాలము నందు రెండు ఏకాదశ రుద్రములు పారాయణ చేస్తూ ఉండగా మరి ఒక 11 మంది ఋత్విక్కులు రుద్ర హావనము చేస్తూ ఐదు రోజుల పాటు ప్రతి రోజు 2662 రుద్రముల పారాయణ చేసి మహా పూర్ణాహుతి అయిన 6వ రోజు 1331 రుద్రమల పారాయణ తో 16,896 రుద్రములు జపించబడ్డాయి, ఇది ఒక అతిరుద్రం ప్లస్ ఒక మహారుద్రం ప్లస్ ఏడు ఏకాదశ రుద్రాలకు అవసరమైన సంఖ్య కంటే కొంచెం ఎక్కువ. అనంతరము ఏకాదశ కలశ మండపములవద్ద రుద్రము తో అభిమంత్రించిన 121 కలసములతో శ్రీ శ్రీ శ్రీ పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వర మహా స్వామి వారికి అభిషేకము తదనంతరం రుద్రార్చన మహా పూర్ణాహుతులతో అత్యంత వైభవోపేతముగా జరిపించారు. ఈ ఆరు రోజులు సాయంత్రం, వేద పురోహితులు క్రమార్చన చేశారు, తరువాత సామవేద జపం మరియు అవధారయాలు జరిగాయి.
అతిరుద్రం 2024 నిర్వహణలో కీలక పాత్ర పోషించిన SDBBS నిర్వహణ కమిటీలో - L కార్తికేయన్, డాక్టర్ I స్వామినాథన్, N ఆనంద్ చంద్రశేఖర్, బాలాజీ ఉన్నారు. రామస్వామి, గణేష్ రాధాకృష్ణన్, ఈశ్వర్ శ్రీనివాసన్, రాజా రామన్, ఎస్ కృష్ణన్, కె సాయిరామ్, కె రామ ప్రసాద్ మరియు వేణు మాధవ్ మల్లవరపు సభ్యులుగా ఉన్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే వివిధ దక్షిణ భారత రాష్ట్రాల నుండి 22 మంది గౌరవనీయులైన పండితులు పాల్గొనడం, వారిలో ముగ్గురు హైదరాబాద్‌లోని స్కందగిరి నుండి విచ్చేసారు. సింగపూర్ నుండి 121 మందికి పైగా ఋత్విక్కులతో పాటు, 4 దశాబ్దాలుగా నివాసి సభ పురోహితులచే వేద సంప్రదాయాలలో శిక్షణ పొందారు. ఇందులో గత దశాబ్దముగా పరమేశ్వరుని సేవలో ఎన్నో వైదిక కార్యక్రమములు చేస్తున్న సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజము అతిరుద్రం 1వ రోజు మధ్యాహ్న భోజనం స్పాన్సర్ చేయడంతో పాటు అతిరుద్రం మహాయాగంలో చల్లా శ్రీ ప్రదాయ, చల్లా శ్రీకాంత్, అనంత్ బొమ్మకంటి, ధర్మారావు అక్కిపెద్ది, గంటి చంద్రశేఖర్, వాడాలి ప్రసాద్, బాలాజీ గరిమెళ్ళ, రాఘవేంద్ర దేవరకొండ, గిరి పిండిప్రోలు, వాసు జనపాటి, కృష్ణ అయ్యగారి, గోవర్ధన్, జగన్, ఫణీన్ద్ర, రమేష్ నేమాని, సుబ్రమణ్యం, గణపతి శాస్త్రి ఆకెళ్ళ, రామ సంతోష్ శ్రీకర్ ఆకెళ్ళ, కామేశ్వర రావు భమిడిపాటి, వెంకట రమణ పమిడిఘంటం, వంశీకృష్ణ శిష్ట్లా, రత్నకుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిరోజు వేలాదిగా భక్తుల శివనామ స్మరణలో పిజిపి హాల్ ప్రాగణం మార్మోగింది. భక్తులకు ఋత్విక్కులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించి వేడుకలకు పవిత్రతను చేకూర్చారు. ప్రతిరోజు అన్ని పురోహితులకు సమారాధనై భోజనం వడ్డించబడింది. తిరుచ్చి నుండి పాల్గొన్న పురోహితులలో ఒకరు కంచి మఠం యొక్క జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ ఆశీర్వదించిన ప్రసాదాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్ కు అందజేశారు.
సభ అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్, కార్యక్రమ డైరెక్టర్ రాజారామన్ మరియు సభ కార్యదర్శి ఆనంద్ చంద్రశేఖర్, అందరి వాద్యార్లకు (పురోహితులు), ఋత్విక్ లకు , దాతలకు, స్వచ్ఛంద సేవకులకు మరియు అన్ని సహాయక సంస్థలకు (శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయం, పిజిపి హాల్, శ్రీ శివన్ ఆలయం, హిందూ ఎండోమెంట్ బోర్డు, కవిత స్టోర్ & ట్రేడింగ్, మరియు ఇతర మౌలిక సదుపాయాల ప్రదాతలు) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద, ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని సాధించింది అని నిర్వాహకులు తెలియజేశారు, పరమశివుడు చాలా సంతోషించాడు, అందుకు నిదర్శనమే ఈ 6 రోజుల కార్యక్రమంలో 3వ రోజు భారీ వర్షం కురిసింది అని నిర్వహకులు ఆనందం వ్యక్తంజేశారు. మరన్ని వివరములకు సభ వెబ్‌సైట్: www.sdbbs.org ను సందర్శించవచ్చు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!
జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!
రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Singapore #SingaporeNews #SingaporeUpdates #IndianMigrants #teluguMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.