నామినేటెడ్ పదవుల జాబితా సిద్దం! మూడు పార్టీల నుంచి పదవులు ఎవరికంటే? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం ఎప్పుడంటే?

Header Banner

నామినేటెడ్ పదవుల జాబితా సిద్దం! మూడు పార్టీల నుంచి పదవులు ఎవరికంటే? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం ఎప్పుడంటే?

  Fri Dec 27, 2024 07:00        Politics

ఎన్డీఏ పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర కానుక ఇవ్వనున్నారు. మూడు పార్టీ ల నుంచి నామినేటెడ్ పదవుల కోసం నిరీక్షిస్తున్న వారికి గుడ్ న్యూస్ సిద్దమైంది. ఇప్పటికే ఖరారు చేయాల్సిన పదవులు.. వ్యక్తుల గురించి బీజేపీ, జనసేన నుంచి చంద్రబాబుకు జాబితాలు అందాయి. సీఎం చంద్రబాబు - డిప్యూటీ సీఎం పవన్ మధ్య చర్చలు జరిగాయి. దీంతో, పెద్ద మొత్తంలో నామినేటెడ్ పదవులను ప్రకటించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. కొత్త సంవత్సరం వేళ చంద్రబాబు, కూటమి నేతలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమయ్యారు. ఈసారి జాబితా పెద్ద సంఖ్యలో ఉంటుందని తెలుస్తోంది. గత రెండు జాబితాల్లో జ‌న‌సేన‌, బీజేపీల‌ కంటే..టీడీపీ నేత‌ల‌కే ఎక్కువగా ప‌ద‌వులు ద‌క్కాయి. కానీ, టీడీపీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఈసారి జాబితాలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నారు. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఎమ్మెల్సీ పదవులు కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీంతో, ఎవరికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి.. ఎవరిని నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయాలనే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్ధుల కోసం సీట్లు త్యాగం చేసిన వారికి ఈ లిస్టు లో ప్రాధాన్యత దక్కనుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న 60 కార్పోరేషన్ల పదవుల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. అందులో బేవరేజెస్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ ఎన్నార్టీ, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఉన్నాయి.

 

ఇంకా చదవండి: సంధ్య థియేట‌ర్ యాజ‌మాన్యం తాజాగా కీల‌క నిర్ణ‌యం! ఇప్ప‌టికే ఆ ప‌నులు ప్రారంభం

 

వీటితో పాటుగా అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్, నెడ్ క్యాప్, ప్రణాళిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా కుల సంఘాల పదవులు ఖరారు కావాల్సి ఉంది.  ఈసారి జాబితాలో మూడు పార్టీల నుంచి పదవులు ఆశిస్తున్న వారి పేర్లలో కొందరికి పదవులు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీ ఆశావాహుల్లో ఎందరో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామ కృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శివ పార్వతి, అలాగే బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సీట్లు త్యాగం చేసిన నేతలు ఎమ్మెల్సీ స్థానాల పైన ఆశలు పెంచుకుంటున్నారు. దీంతో, చంద్రబాబు ప్రకటించే జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

 

ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!

 

రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!

 

నేడు (26/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

 

తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

 

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews