మన్మోహన్ సింగ్ మృతి.. ఏడు రోజుల పాటు సంతాప దినాలు.. ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు!

Header Banner

మన్మోహన్ సింగ్ మృతి.. ఏడు రోజుల పాటు సంతాప దినాలు.. ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు!

  Fri Dec 27, 2024 09:08        Politics

భారత దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం మరణించారు. ఆయన మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం. ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 11గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సందర్బంగా మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలపనుంది. ఆయన అంతిమ సంస్కారాలు అన్ని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది.. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు.. మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు.. దేశాన్ని సమర్థంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు.

 

ఇంకా చదవండి: మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా? అయితే ఇలా చెయ్యండి!

 

రాత్రి 8.06 గంటల సమయంలో కుటుంబసభ్యులు ఆయన్ను ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనను కాపాడడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని... రాత్రి 9:51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. మన్మోహన్‌సింగ్‌కు భార్య గురుచరణ్‌, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్‌, అమృత్‌, దమన్‌ ఉన్నారు. మన్మోహన్‌ను ఆస్పత్రిలో చేర్పించారన్నవార్త తెలిసిన వెంటనే.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇక.. కర్ణాటకలోని బెలగావీలో జరుగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీలో పాల్గొన్న పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ.. మన్మోహన్‌ మరణవార్త తెలియగానే ఢిల్లీకి పయనమయ్యారు.

 

ఇంకా చదవండి: 7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

ఆయన గౌరవార్థం.. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సహా వచ్చే ఏడు రోజులపాటు నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలనూ రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. 2025 జనవరి 3న పార్టీ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. అప్పటిదాకా పార్టీ జెండాను అవనతం చేస్తామని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. కాగా.. మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహాన్ని గురువారం రాత్రే ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. మన్మోహన్‌ మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. కాగా.. ఆయన గౌరవార్థం కేంద్రం ఏడురోజులు జాతీయ సంతాపదినాలుగా ప్రకటించింది.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల జాబితా సిద్దం! మూడు పార్టీల నుంచి పదవులు ఎవరికంటే? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం ఎప్పుడంటే?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

 

7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!

 

రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!

 

నేడు (26/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

 

తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

 

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #ManmohanSingh #Demise #NewDelhi #AIIMS #Congress #India