రూ. 40ల‌క్ష‌ల ఆన్‌లైన్ పేమెంట్స్! పానీపూరీ వ్యాపారికి జీఎస్‌టీ నోటీసులు!

Header Banner

రూ. 40ల‌క్ష‌ల ఆన్‌లైన్ పేమెంట్స్! పానీపూరీ వ్యాపారికి జీఎస్‌టీ నోటీసులు!

  Sun Jan 05, 2025 13:04        Business

మ‌న ద‌గ్గ‌ర స్ట్రీట్ ఫుడ్ పానీపూరీకి ఉన్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏ మూలన చిన్న కొట్టుపెట్టిన కూడా జ‌నాలు క్యూ క‌డుతుంటారు. గిరాకీకి త‌గ్గ‌ట్టుగానే పానీపూరీ వ్యాపారులు డ‌బ్బులు ఆర్జిస్తుంటారు. అయితే, త‌మిళ‌నాడులోని ఓ పానీపూరీ వ్యాపారికి జీఎస్‌టీ నోటీసులు రావ‌డంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

స‌ద‌రు వ్యాపారికి 2023-24లో రూ. 40ల‌క్ష‌ల ఆన్‌లైన్ పేమెంట్స్ వ‌చ్చిన‌ట్టు గుర్తించిన‌ క‌మిష‌న్ ప‌న్ను చెల్లించాల‌ని ఆదేశించిన‌ట్టు స‌మాచారం. 2024 డిసెంబర్ 17న తమిళనాడు వస్తువులు, సేవల పన్ను చట్టం మరియు కేంద్ర జీఎస్‌టీ చట్టంలోని సెక్షన్ 70 కింద అత‌నికి సమన్లు జారీ చేశారు. పానీపూరీ విక్రేత వ్యక్తిగతంగా హాజరు కావాలని, అవసరమైన పత్రాలను సమీక్ష కోసం సమర్పించాలని నోటీసులో పేర్కొన‌డం జ‌రిగింది. దీనికోసం అత‌ని 2022, 2023 లావాదేవీల‌ను అధికారులు విశ్లేషించిన‌ట్టు తెలుస్తోంది. క‌స్ట‌మ‌ర్లు యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు చేయ‌డంతో ఇది బ‌య‌ట‌ప‌డింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ వ్య‌వ‌హ‌రంపై ఇప్పుడు నెట్టింట చ‌ర్చ జరుగుతోంది. నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. "ఇది చాలా మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ప‌నిచేస్తున్న ప్రొఫెస‌ర్ల జీతం కంటే ఎక్కువ" అని ఒక‌రు, "ఒక్క డిజిట‌ల్ చెల్లింపుల ద్వారానే ఇంత ఆర్జించాడంటే.. న‌గ‌దు రూపంలో వ‌చ్చిన డబ్బు మాట ఏంటి?. అత‌ని వార్షిక ఆదాయం చాలా ఎక్కువ‌" అని మ‌రొక‌రు, "ఈ వార్త నెట్టింట‌ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుంది. భవిష్యత్తులో ఎవరూ యూపీఐ చెల్లింపులను అంగీకరించరు" అని ఇంకొక‌రు కామెంట్ చేశారు. 

GST Notice For Panipuri Seller.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా.. 

 

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి! 

 

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల! 

 

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే! 

 

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు.. 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #UPI #GST #Tax