అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త! మూడు రోజుల పాటూ! అస్సలు మిస్ అవ్వకండి!

Header Banner

అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త! మూడు రోజుల పాటూ! అస్సలు మిస్ అవ్వకండి!

  Tue Jan 07, 2025 12:13        Travel

అరకు అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. డిసెంబర్, జనవరి వచ్చిందంటే చాలు పర్యాటకులు అక్కడికి క్యూ కట్టేస్తారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను చూస్తూ ఎంజాయ్ చేస్తారు.. ముఖ్యంగా వీకెండ్‌లో ఎక్కువమంది పర్యాటకులు కనిపిస్తారు. అయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది... దాదాపు ఐదేళ్ల తర్వాత అరకు ఉత్సవ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 31, ఫిబ్రవరి 1,2 తేదీల్లో అరకు ఉత్సవ్‌‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

 

ఎత్తైన కొండల మధ్య ప్రకృతి అందాలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు, మెలికలు తిరిగే ఘాట్ రోడ్డు... ఇలా భూతల స్వర్గంలా అనిపించే అరకు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అరకులో వంజంగి మేఘాల కొండ, బొర్రా గుహలు, అనంతగిరి ఫారెస్ట్, గిరిజన మ్యూజియం, కాఫీ తోటలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఆకర్షణలు పర్యాటకులను కట్టి పడేస్తుంటాయి. అంత అందమైన అరకు టూర్‌కు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ నెల 31, ఫిబ్రవరి 1,2 తేదీల్లో అరకు ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నట్లు పది రోజుల క్రితం అధికారులు ప్రకటించారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ అరకు ఉత్సవ్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు అధికారులు. ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అరకు ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించామని... ఈ ఉత్సవ్‌‌పై ప్రభుత్వానికి నివేదికను పంపినట్లు ఐటీడీఏ పీవో అభిషేక్‌ తెలిపారు. అరకు ఉత్సవ్ నిర్వహణ అనుమతి, నిధులు మంజూరుకు ఆమోదం రావాల్సి ఉందన్నారు. ఈ ఉత్సవ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చెబుతామన్నారు. రూ.కోటి వ్యయంతో పద్మాపురం గార్డెన్‌ను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు పనుల్ని మరింత వేగవంతం చేశామని... ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అరకు ఉత్సవ్‌‌పై పూర్తి క్లారిటీ ఇస్తామంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అరకు ఉత్సవ్‌ను 2014 నుంచి 2019 వరకు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ వేడుకను నిర్వహించలేదు... ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం అరకు ఉత్సవ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. 

 

మరోవైపు ఈనెల 12న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయకు సుప్రీం కోరోర్టు న్యాయమూర్తులు పర్యటించనున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతోపాటు 25 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించారు... స్థానిక పోలీస్‌, టూరిజం, రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. అరకు పర్యటనకు వచ్చే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు గిరిజన మ్యూజియం తోపాటు గిరి గ్రామదర్శినిని పరిశీలిస్తారన్నారు. అలాగే అనంతగిరి హరిత హిల్‌ రిసార్ట్స్‌లో విశ్రాంతి తీసుకుని... బొర్రాగుహలను సందర్శిస్తారన్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి విశాఖపట్నం వెళతారన్నారు. అరకు లోయలో గిరిజనులతో మమేకం అవుతారని.. అక్కడి పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటారన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పర్యటనకు వస్తుండటంతో.. ఈ నెల 12న గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శినిల్లోకి పర్యాటకులకు అనుమతి ఉండదని పీవో అభిషేక్ తెలిపారు. సీజేఐ, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల రాకతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం! 

 

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం! 

 

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్! 

 

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Travel #Araku #Vizag #BorraCaves