మద్యపానంతో క్యాన్సర్‌ ముప్పు! ఎంత తాగినా ఆరోగ్యానికి నష్టం తప్పదు!

Header Banner

మద్యపానంతో క్యాన్సర్‌ ముప్పు! ఎంత తాగినా ఆరోగ్యానికి నష్టం తప్పదు!

  Sun Jan 05, 2025 13:16        Health

సిగరెట్‌, పొగాకు క్యాన్సర్‌కు కారణమవుతాయనే అవగాహన చాలామందికి ఉంది. అయితే, మద్యం విషయంలో మాత్రం భిన్నమైన మాటలు వినిపిస్తుంటాయి. రోజూ కొంత మోతాదులో మద్యపానం సురక్షితమేనని, రెడ్‌ వైన్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఈ ప్రచారాలను అమెరికా సర్జన్‌ జనరల్‌ తాజా నివేదిక కొట్టిపారేసింది.

 

మద్యపానంలో సురక్షిత మోతాదు అనేదేమీ ఉండదని, ఎంత తాగినా ఆరోగ్యానికి నష్టం తప్పదని స్పష్టం చేసింది. పొగాకు లాగానే మద్యపానం కూడా క్యాన్సర్‌కు కారణమవుతుందని స్పష్టం చేసింది. మద్యపానంతో క్యాన్సర్‌ ముప్పుపై శుక్రవారం అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి ఒక నివేదికను విడుదల చేశారు. అమెరికాలో వైద్యపరంగా సర్జన్‌ జనరల్‌ హోదా కీలకమైనది. దేశాధ్యక్షుడు స్వయంగా నియమించే సర్జన్‌ జనరల్‌.. దేశ ప్రజలకు అవసరమైన ఆరోగ్య మార్గదర్శకాలను జారీ చేస్తారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

2014 నుంచి అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీతో పాటు వివిధ సంస్థలు క్యాన్సర్‌పై చేసిన అధ్యయనాల ఆధారంగా అమెరికా సర్జన్‌ జనరల్‌ ఈ నివేదికను విడుదల చేశారు. మద్యపానం వల్ల రొమ్ము, కొలొరెక్టల్‌(పెద్ద పేగు), అన్నవాహిక, కాలేయ, నోటి, గొంతు, స్వరపేటిక క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొన్నది. ధూమపానం వల్ల 19 శాతం క్యాన్సర్‌ కేసులు, 29 శాతం క్యాన్సర్‌ మరణాలు సంభవిస్తున్నాయని, అధిక శరీర బరువు వల్ల 7.8 శాతం క్యాన్సర్‌ కేసులు, 6.5 శాతం క్యాన్సర్‌ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ రెండింటి తర్వాతి స్థానంలో మద్యపానం ఉందని, 5.6 క్యాన్సర్‌ కేసులకు, 4 శాతం క్యాన్సర్‌ మరణాలకు మద్యపానమే కారణమని వెల్లడించింది. యూవీ రేడియేషన్‌ కంటే మద్యం వల్లే క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్టు తెలిపింది.

 

మహిళలకు ఎక్కువ ముప్పు
అమెరికాలో ఏటా లక్ష క్యాన్సర్‌ కేసులకు, 20 వేల క్యాన్సర్‌ మరణాలకు మద్యపానమే కారణమవుతున్నదని ఈ నివేదిక వెల్లడించింది. మద్యపానం చేసే మహిళలకు క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక పేర్కొన్నది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసుల్లో దాదాపు 17 శాతం వాటికి మద్యపానం కారణం కావొచ్చని తెలిపింది. మహిళలు వారానికి కేవలం రెండు డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ ముప్పు పురుషుల కంటే వారిలో ఎక్కువగా ఉంటున్నదని వెల్లడించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా.. 

 

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి! 

 

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల! 

 

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే! 

 

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు.. 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Cancer #Alcohol #Liquor