ఈ రైలులో ఎప్పుడైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు! అది ఎక్కడో తెలుసా!

Header Banner

ఈ రైలులో ఎప్పుడైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు! అది ఎక్కడో తెలుసా!

  Fri Jan 10, 2025 15:14        India

మన దేశంలో ట్రైన్ లేదా బస్సు ఇంకా ఏ ట్రావెల్ చేసినా టికెట్ తీసుకోవడం అనేది చాలా కామన్. కానీ ఈ ఒక్క ట్రైన్లో ఎన్నిసార్లు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా జర్నీ చేయొచ్చు. ఇంతకీ ఆ రైలు ఎక్కడుంది.. దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

 

భారతదేశంలో టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. టికెట్ లేకుండా టికెట్ కలెక్టర్‌కు పట్టుబడితే జరిమానా కట్టాల్సిందే. లేదంటే కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. అయితే భారతీయ రైల్వేలో ఒక స్పెషల్ ట్రైన్ ఉంది. అందులో మీరు ఎప్పుడైనా.. ఎన్నిసార్లు అయినా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. వినడానికి వింతగా ఉన్నా ఇది వంద శాతం వాస్తవం. ఈ రైలులో జర్నీ చేసే సమయంలో ఏ టికెట్ కలెక్టర్ రారు.. ఆ రైల్వేస్టేషన్లో దిగాక కూడా ఎవ్వరూ మిమ్మల్ని టికెట్ చూపించమని అడగరు. అయితే ఆ ట్రైన్లో జర్నీ చేయాలంటే మీరు అక్కడికి వెళ్లాల్సిందే.. ఈ సందర్భంగా ఆ ట్రైన్ పేరేంటి.. అది ఏ ప్రాంతంలో ఉంది. దాని వివరాలేంటో ఇప్పుడే చూసెయ్యండి... 

 

భారతీయ రైల్వేలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. అందుకే చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే 75 సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేక రైలు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఈ స్పెషల్ ట్రైన్లో జర్నీ చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఎందరో టూరిస్టులు వస్తుంటారు. ఎందుకంటే ఈ రైలులో ఉచితంగా జర్నీ చేయొచ్చు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పాండబ్-హిమాచల్ ప్రదేశ్ మధ్య ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ పేరు భాక్రానంగల్. ఇందులో జర్నీ చేసేందుకు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రైలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. భాక్రా నంగల్ డ్యామ్ చూసేందుకు ఈ రైలులో ప్రయాణించేందుకు ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు.

 

ఈ రైలు సట్లేజ్ నది, శివాలిక్ కొండల మధ్య వెళ్తుంది. ఇక్కడున్న అందమైన ప్రదేశాలను చూసేందుకు టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో ఈ రైల్లో జర్నీ చేస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగులు కూడా జరుగుతాయి. ఈ రైలు మూడు సొరంగాలు, ఆరు స్టేషన్ల నుంచి వెళ్తుంది. డిజీల్ తో ఈ రైలులోని భోగీలన్నీ చెక్కతో తయారు చేసినవే. మూడు కోచ్‌లతో కూడిన ఈ రైలును మొదటిసారిగా 1948లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

 

అయితే ఈ రైలులో ప్రయాణించాలంటే రోజుకు కేవలం 800 మంది ప్రయాణించాలి. ఈ రైలు ప్రారంభంలో ఆవిరితో కూడిన ఇంజిన్ తో నడుస్తుంది. 1953లో దీనికి డీజిల్ ఇంజిన్లు అమర్చారు. భాక్రా బోర్డు మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రైలును మొదట్లో కార్మికులు, ఉద్యోగుల కోసం నిర్మాణ సామాగ్రిని రవాణా చేయడం కోసం నడిపారు. డ్యామ్ పూర్తయ్యేగానే ఈ రైలును టూరిస్టుల కోసం ఉచితంగా నడపాలని అప్పుడే నిర్ణయించారు. అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #travel #India #Punjab #HimachalPradesh