విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

Header Banner

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

  Fri Jan 10, 2025 19:09        Entertainment

యూట్యూబర్, టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. మైనర్ బాలికను గర్భవతిని చేశాడనే కేసులో విశాఖపట్నం పోక్సో కోర్టు ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటుగా రూ.4 లక్షలు జరిమానా విధించింది. వెబ్ సిరీస్‌లలో అవకాశాలు ఇప్పిస్తానని మైనర్ బాలికను మోసం చేశారంటూ 2021లో ఫన్ బకెట్ భార్గవ్ మీద కేసు నమోదైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫన్ బకెట్ భార్గవ్ మీద కేసు నమోదైంది. ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 

 

టిక్ టాక్ స్టార్, యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు షాక్ తగిలింది. ఫన్ బకెట్ భార్గవ్‌కు విశాఖపట్నం పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మైనర్ బాలికను గర్భవతిని చేశారంటూ ఫన్ బకెట్ భార్గవ్‌ మీద కేసు నమోదైంది. ఈ కేసులో భార్గవ్‌ను దోషిగా తేల్చిన విశాఖపట్నం పోక్సో కోర్టు.. 20 ఏళ్ల జైలు శిక్ష, 4 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

 

విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్ చిప్పాడ.. ఒక సాధారణ రైల్వే గేట్ మ్యాన్ కొడుకు. టిక్ టాక్ వీడియోల ద్వారా భార్గవ్ ఫేమస్ అయ్యారు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఫన్ బకెట్ భార్గవ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పట్లో భార్గవ్ చిప్పాడ ఒక సెన్సేషన్. ఒక దశలో 43 లక్షల వ్యూయర్‌షిప్‌తో దక్షిణ భారతదేశంలోనే మొదటి ర్యాంకులో నిలిచారు. ఇలా తన వీడియోల ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదగడంతో ఫన్ బకెట్ భార్గవ్ పేరు మీడియాలో మార్మోగింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ క్రమంలోనే ఫన్ బకెట్ భార్గవ్‌కు విశాఖపట్నంలోని సింహగిరికి చెందిన 14 ఏళ్ల బాలిక పరిచయమైంది. ఆన్‌లైన్ చాటింగ్‌ ద్వారా ఒకరికొకరికి పరిచయం అయ్యారు. మైనర్ బాలికకు కూడా టిక్ టాక్ వీడియోలంటే ఇఁట్రెస్ట్ ఉండటంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే, ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆ మైనర్ బాలికను ఫన్ బకెట్ భార్గవ్ గర్భవతిని చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు 2021 ఏప్రిల్ 16న పెందుర్తి పోలీసులకు ఫన్ బకెట్ భార్గవ్ మీద ఫిర్యాదు చేశారు. వెబ్ సిరీస్‌లలో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేసి గర్భవతిని చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పెందుర్తి పోలీసులు భార్గవ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును విశాఖ సిటీ దిశ పోలీసులకు మార్చారు.

 

ఇక అప్పటి నుంచి ఫన్ బకెట్ భార్గవ్ కేసు విచారణ విశాఖపట్నం పోక్సో కోర్టులో కొనసాగుతూ వస్తోంది. ఈ కేసులో ఫన్ బకెట్ భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యలో భార్గవ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. దాదాపు మూడున్నరేళ్ల పాటు విచారణ సాగిన అనంతరం.. ఫన్ బకెట్ భార్గవ్‌ను దోషిగా తేలుస్తూ విశాఖపట్నం కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. దీంతో ఈ కేసులో బెయిల్‌ మీద ఉన్న భార్గవ్ ఇప్పుడు మళ్లీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి.. అయితే విశాఖపట్నం పోక్సో కోర్టు తీర్పుపై భార్గవ్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Entertainment #FunBucketBhargav #Arrest #Vizag