జగన్ పాలనలో జరిగిన అరాచకాలు బయటకు.. సీ పోర్టు విషయంలో కొంప కొల్లేరు! సీఐడీ ఎంక్వైరీ.. ఇక జైల్లో ఊచలు!

Header Banner

జగన్ పాలనలో జరిగిన అరాచకాలు బయటకు.. సీ పోర్టు విషయంలో కొంప కొల్లేరు! సీఐడీ ఎంక్వైరీ.. ఇక జైల్లో ఊచలు!

  Tue Jan 21, 2025 10:17        Politics

సీ పోర్టు డీల్ రివర్స్  అయింది. వాటాలను అరబిందో కంపెనీ తిరిగి కేవీరావు కు ఇచ్చేసింది. మూడు రోజుల క్రితం బదిలీ కార్యక్రమం గుట్టుగా జరిగిపోయింది. ఈ వివాదంలో పైస్థాయి వ్యక్తులు మధ్యవర్తిత్వం జరిపారు. అయితే సెజ్‌ను మరిచిపోవాలంటూ కేవీరావుకు షరతు విధించారు. దానికి బదులుగా పోర్టులో గతంలో లాక్కున్న 41.12 శాతం వాటాలు తిరిగి బదిలీ చేశారు. ఈ క్రమంలో కేవీ రావు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కాగా తనను బెదిరించి.. భయపెట్టి పోర్టులో వాటాలు లాగేసుకున్నారని గత నెలలో కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అటు సీఐడీ ఫిర్యాదు ఆధారంగా రూ.494 కోట్ల చెల్లింపులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.. వైవి విక్రాంత్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. ఒకవైపు ఈడీ విచారణ జరుగుతుండగానే కేవీ రావుకు గతంలో గుంజుకున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఇచ్చేసింది. కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు చేయడం... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది.

 

ఇంకా చదవండి: ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!

 

కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. మూడు రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్లు సమాచారం. విషయాన్ని అటు సీఐడీ, ఇటు ఈడీ లోతుగా లాగకుండా ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. కానీ... దీని వెనుక జరిగింది వేరని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... కాకినాడ పోర్టులో మనీలాండరింగ్‌పై ఈడీ ఆరా తీస్తుండటం... అరబిందో ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి తలెత్తడం... తీగలాగితే భారీగా డొంక కదిలే పరిస్థితి ఉండటంతో కాకినాడ సీపోర్ట్‌ డీల్‌ ‘రివర్స్‌’ అయ్యింది. ప్రస్తుత పరిస్థితులను కేవీరావు పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. పైస్థాయి వ్యక్తులు కొందరు రంగంలోకి దిగి... ఇద్దరినీ కూర్చోబెట్టి కొత్త ‘డీల్‌’కు ఓకే చెప్పించారు. అప్పట్లో... రూ.2500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను జగన్‌ బ్యాచ్‌ రూ.494 కోట్లకే లాగేసుకుందని కేవీ రావు ఆరోపించారు. దీనిపై సీఐడీకి కూడా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేవీరావుకు చెందిన... 8 వేల ఎకరాలున్న కాకినాడ సెజ్‌ పూర్తిగా అరబిందోకు సొంతమైంది. తాజాగా... ‘కాకినాడ సెజ్‌ గురించి మరిచిపోండి. అది అరబిందోకే! పోర్టులో మీ నుంచి తీసుకున్న వాటాలు మీకే వచ్చేస్తాయి’’ అని డీల్‌ కుదిరింది. దీని ప్రకారం 3 రోజుల కిందట అరబిందో పేరుతో ఉన్న 2.15 కోట్ల షేర్లు కేవీరావుకు బదిలీ అయిపోయాయి. దీనికి సంబంధించి అప్పట్లో తనకు చెల్లించిన డబ్బులను కేవీరావు అరబిందోకు తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. దీంతో కాకినాడ పోర్టు పూర్తిగా కేవీరావు వశమైంది. సీపోర్టుకు స్టాక్‌ ఎక్స్ఛేంజీతో సంబంధం లేకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోయింది. ఇక... కాకినాడ సెజ్‌లో తన వాటాగా రూ.1104 కోట్లు రావలసి ఉండగా, రూ.12 కోట్లతో సరిపెట్టారని కేవీరావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోర్టు వాటాలను తిరిగి ఇచ్చేసినందున.. ఇక సెజ్‌ గురించి మరిచిపోయేలా డీల్‌ కుదిరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కేవీరావు మాత్రం, సెజ్‌లో వాటాలను వదులుకునేది లేదని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.

 

ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబు, లోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం!

 

నేడు (20/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

 

జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

 

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

 

ఏపీ లో భూముల రిసర్వే మళ్ళీ షురూ! ఎప్పటి నుంచి ఆంటే? కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

బాధ్యతల స్వీకరణ తర్వాత భారత్‌లో ట్రంప్‌ పర్యటన! ఎప్పుడు? ఎందుకూ అంటే.!

 

ఓరి దేవుడా.. మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం! భక్తులు భయంతో ఉరుకులు పరుగులు!

 

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #Visakhapatnam #AndhraPradesh #APpolitics #MLS #MPS #Resign #JaganViral #News #APNews