జేఈఈ పేపర్-1, పేపర్-2 పరీక్షలు ప్రారంభం! తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నరమందికి పైగా హాజరు!

Header Banner

జేఈఈ పేపర్-1, పేపర్-2 పరీక్షలు ప్రారంభం! తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నరమందికి పైగా హాజరు!

  Wed Jan 22, 2025 10:18        Others

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్  పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థుల వెళ్లడంతో హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్లో ట్రాఫిక్కు కాసేపు అంతరాయం కలిగింది. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 నిర్వహిస్తారు. చివరి రోజు 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 జరుగుతుంది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jeeMains #exam #centers #todaynews #flashnews #latestupdate