ముసుగు దాడి ఆరోపణలపై హైకోర్టు విచారణ! రఘురామ కేసులో సంచలన మలుపు!

Header Banner

ముసుగు దాడి ఆరోపణలపై హైకోర్టు విచారణ! రఘురామ కేసులో సంచలన మలుపు!

  Wed Jan 22, 2025 12:15        Politics

సీఐడీ కస్టడీలో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిన నలుగురు అధికారులు తనను కొట్టారని మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారని, సాక్షులు సైతం నలుగురు వ్యక్తులు ముసుగుతో వచ్చారనే వాంగ్మూలం ఇచ్చారని కామేపల్లి తులసిబాబు తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఒడ్డు, పొడుగు ఆధారంగానే పిటిషనర్ను నిందితునిగా చేర్చి అరెస్టుచేశారని, దాడి ఘటనలో పాల్గొన్నారనేందుకు ఆధారాల్లేవని తెలిపారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!



ఆయనకు బెయిల్ మంజూరుచేయాలని కోరారు. పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పీపీ ఎం. లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. దిగువ కోర్టులో పోలీసు కస్టడీ పిటిషన్పై వాదనలు జరుగుతున్నాయని, ప్రస్తుత బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో విచారణను ఈ నెల 24కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ ప్రకటించారు. వైకాపా హయాంలో రఘురామను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఆయన ఇటీవల గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు తులసిబాబును అరెస్ట్ చేయడంతో ఆయన బెయిల్ కోసం ఈ పిటిషన్ దాఖలు చేశారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #cid #custody #inquiry #highcourt #todaynews #flashnews #latestupdate