సైబర్ క్రైమ్ పెరుగుదలపై డీజీపీ ఆందోళన! ప్రతి జిల్లాలో ప్రత్యేక స్టేషన్లు త్వరలో!
Tue Jan 28, 2025 12:14 Othersఏపీలో సైబర్ క్రైమ్ పెరిగిందని.. ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. "సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ పెట్టాలని యోచిస్తున్నాం. నిపుణులను ఉపయోగించుకోవడం.. ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే డబ్బులు చెల్లించవద్దు. సైబర్ క్రైమ్ నిరోధానికి ఏకైక మార్గం అవగాహనే. చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం" అని ఆయన పేర్కొన్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!
రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి గంజాయికి అడ్డుకట్ట వేస్తున్నట్టు వివరించారు. గంజాయి ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలు ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడలో బుధవారం 37వేల కిలోల గంజాయిని దగ్ధం చేయనున్నట్టు వివరించారు. పోలీసులు ఇటీవల సంకల్పం పేరిట మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మార్చి ఒకటి నాటికి లక్ష కెమెరాల ఏర్పాటు లక్ష్యం
నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించామన్నారు. సీసీ కెమెరాలను దాతల, ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎక్కడ, ఎటువంటి క్రైమ్ జరిగిన ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలనేదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల స్పాట్లను గుర్తించడం జరిగిందని, రెండు లక్షల సీసీ కెమెరాలను ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోలీసులు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందజేయాలని చెప్పారు. రాష్ట్ర మొత్తంగా చూసుకుంటే క్రైమ్ రేట్ తగ్గడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోందని వారు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే అవకాశం లేదన్నారు. మావోయిస్టుల ఏరివేతను అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #DGP #cybercrime #case #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.