ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా.. ప్రియమణి షాకింగ్ స్టేట్‌మెంట్!

Header Banner

ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా.. ప్రియమణి షాకింగ్ స్టేట్‌మెంట్!

  Wed Jan 29, 2025 13:17        Cinemas

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియమణి... పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి... మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటోంది. హిందీలో 'ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సిరీస్ లో నటిస్తోంది. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. మరోవైపు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దర్శకుడు మణిరత్నంపై ప్రశంసలు కురిపించింది. ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టమని ప్రియమణి తెలిపింది. ఆయన సినిమాలో అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదని చెప్పింది. ‘‘మణి సార్ నుండి ఫోన్ రాగానే నేను మణి సార్ సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా అన్నట్టు సిద్ధంగా ఉంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది’’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. ఆయన దర్శకత్వంలో ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా ఓకే చెప్తానంటోంది. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే... కమిట్ అయిన వేరే సినిమాలను కూడా వదులుకోవడానికి సిద్ధమని తెలిపింది. మణిరత్నం నుంచి ఫోన్ వస్తే నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపింది. హీరోయిన్లకు మణిరత్నం ఫేవరెట్ డైరెక్టర్ అని... వారిని తెరపై ఆయన చాలా అందంగా చూపిస్తారని చెప్పింది. దక్షిణాదిన లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం కూడా ఒకరని తెలిపింది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove