BRS కార్పొరేటర్లు సస్పెండ్.. ఆపై అరెస్ట్.. జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం..
Thu Jan 30, 2025 15:32 Politicsజీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈరోజు బడ్జెట్ ఆమోదం అనంతరం ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టడంతో సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి సమక్షంలోనే కార్పొరేటర్లు పరస్పరం తోసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్ళారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంకా చదవండి: దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
అదుపులోకి తీసుకున్న తమ కార్పొరేటర్లను తిరిగి సభకు తీసుకువచ్చాకే సభను కొనసాగించాలని నినాదాలు చేశారు. మరోవైపు, బీఆర్ఎస్ సభ్యులు మేయర్ పైకి పేపర్లు విసిరారని, అందుకు వారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రజా సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించగా, వారు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు.. కారణమిదే!
ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!
భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!
జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!
ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #BRS #GHMC #Hyderabad #Congress
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.