అక్షరాలు చదవలేని స్థితికి విద్యార్థులు.. వైసీపీ హయాంలో విద్యకు గట్టి దెబ్బ! లోకేష్ కీలక వ్యాఖ్యలు..!

Header Banner

అక్షరాలు చదవలేని స్థితికి విద్యార్థులు.. వైసీపీ హయాంలో విద్యకు గట్టి దెబ్బ! లోకేష్ కీలక వ్యాఖ్యలు..!

  Wed Jan 29, 2025 18:34        Politics

జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు. “పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది. 2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు.. వైసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదిక స్పష్టంగా వెల్లడించింది. అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు తయారయ్యారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల! 


తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండో తరగతి పుస్తకాలు సరిగా చదవలేని పరిస్థితి నెలకొంది.” అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు గత ఏడు నెలలుగా అనేక చర్యలు తీసుకున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలికాలికినట్లు వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


“ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు అని పక్కా లెక్కలు తీస్తున్నాం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్యప్రణాళిక సిద్ధం చేయడం, విలువలతో కూడిన విద్య, విద్యార్థులను క్రీడలతో సహా ఇతర రంగాల్లో ప్రోత్సహించే గైడెన్స్ ఇస్తున్నాం. కనీస మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం వరకూ అనేక అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నాం.” అని వెల్లడించారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

 

తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!

 

డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!

 

దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..

 

షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టునంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!

 

శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!

 

కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #students #education #jagan #todaynews #flashnews #latestupdate