అరకు వ్యాలీలో వింటర్ వేడుకలు గ్రాండ్.. మంచుమేఘాలే స్క్రీన్..! ఉర్రూతలూగించే అడ్వెంచర్స్!

Header Banner

అరకు వ్యాలీలో వింటర్ వేడుకలు గ్రాండ్.. మంచుమేఘాలే స్క్రీన్..! ఉర్రూతలూగించే అడ్వెంచర్స్!

  Thu Jan 30, 2025 12:16        Others

ఆంధ్రా ఊటీ అరకువ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధం అయింది. ఉర్రూతలూగించే అడ్వెంచర్స్, హెలీ రైడ్స్ ఒక పక్క.. గిరిజన సాంప్రదాయ కార్నివాల్ మరోపక్క.. ఎటు చూసిన ధూమ్ ధామ్ వాతావరణమే కనిపించనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. అరకు అంటేనే ఆనందం. వింటర్ సీజన్ అంటే పర్యాటకానికి మహదానందం. ఇక్కడ వుంటే కొండలు, లోయలు, జలపాతాలే కాదు ఒణికించేసే చలి.. దట్టంగా కమ్ముకునే పొగమంచు, సింగిల్ డిజిట్ టెంపరేచర్ కూడా టూరిస్టులకు పండగే. వలిసెల వయ్యారాలు.. ప్రకృతి పరవశంతో సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య అరకు అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. పొగమంచుతో ఆకాశమంతా వెండిమబ్బులు దర్శనమిస్తాయి. ఇక్కడి వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకు, లంబసింగి, వంజంగిలో మంచు మేఘాలను చూస్తుంటే వెండి మబ్బుల ఆకాశమే దిగివచ్చిందా అన్నట్టు కనిపిస్తోంది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!


ఇలాంటి చిల్లింగ్ క్లైమాట్లో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం కోల్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది ఏపీ పర్యాటక శాఖ. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి.. అరకు రీజియన్కు విస్తృతమైన ప్రమోషన్ కల్పించడం ద్వారా పర్యాటక పెట్టుబడులను ఆకర్షించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా అరకు చలి ఉత్సవ్ను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి కోటి రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ నెల 31న జానపద కళాకారులతో భారీ కార్నివాల్తో అరకు ఫెస్ట్ స్టార్ట్ అవుతుంది. మంత్రి కందుల దుర్గేష్ చలి ఉత్సవ్ ప్రారంభిస్తారు. ఏడు రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారులు సంప్రదాయ ప్రదర్శనలు చేయనున్నారు. దేశంలో ఉన్న గిరిజనుల సాంప్రదాయాలు, ఆచారాలను ఉత్సవాల ప్రాంగణంలో ప్రదర్శించేందుకు రెడీ అయింది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



కేవలం కల్చర్ ఒక్కటే కాదు.. అడ్వెంచర్ ఈ వేడుకల్లో పర్యాటకులకు సొంతంకానుంది. హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్ తో పాటు తొలిసారి హెలీ రైడ్ అనుభూతి దక్కించుకునే ఏర్పాట్లు జరిగాయి. ప్రైవేట్ సంస్థ మూడు రోజుల పాటు హెలీరైడ్ కోసం అనుమతులు పొందింది. ఐదు నిముషాల పాటు అరకు వ్యాలీ మొత్తం హెలీకాఫ్టర్లో విహంగ వీక్షణం చేయడం మరుపురాని అనుభూతిగా వుంటుందని నిర్వహకులు చెబుతున్నారు. అరకు చలి ఉత్సవ్ ధూంధాంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. ప్రధాన వేదిక దగ్గర రోజూ 15 నుంచి 20 వేల మంది వుంటారని అంచనా. ఇక పర్యాటకులు, స్థానికులతో కలిసి ఫుట్ ఫాల్ 50 వేలకు పైగా వుంటుందని లెక్కలేస్తున్న జిల్లా యంత్రాంగం.. అందుకు తగ్గట్టుగా భారీగానే ఏర్పాట్లు చేసింది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #andhra #ooty #arakuvalley #adventures #todaynews #flashnews #latestupdate