ఇంటింటికీ మళ్లీ ఫైబర్నెట్‌.. టీడీపీ సర్కార్ సంచలన నిర్ణయం! తక్కువ ధరలో అందుబాటులోకి..!

Header Banner

ఇంటింటికీ మళ్లీ ఫైబర్నెట్‌.. టీడీపీ సర్కార్ సంచలన నిర్ణయం! తక్కువ ధరలో అందుబాటులోకి..!

  Thu Jan 30, 2025 13:35        Politics

ఇంటింటికీ కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్కు చౌకగా అందించే ఫైబర్నెట్ మళ్లీ ప్రజాదరణ చూరగొనేందుకు శక్తియుక్తులు కూడగడుతోంది. రూ.149 బేసిక్ ప్లాన్ను మళ్లీ ప్రవేశ పెట్టి రాష్ట్రంలో కోటిమందికి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ నుంచి సరికొత్త కార్యాచరణ అమల్లోకి తెచ్చేలా రంగం సిద్ధమవుతోంది. ఏపీలో ఇంటింటింకీ అతి తక్కువ ధరకే చౌకగా వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో 2017లో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఏపీ ఫైబరె నెట్. అప్పట్లో ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్లను సర్వీస్ ప్రొవైడర్లు విడివిడిగా అందిస్తుండగా వాటికి నెలవారీ బిల్లు తడిసి మోపెడయ్యేది. మూడు రకాల సేవల్ని ఒకే కనెక్షన్గా ఇచ్చి దేశం దృష్టిని ఆకర్షించించింది నాటి టీడీపీ ప్రభుత్వం. కేవలం రూ.149కే బేసిక్ ప్లాన్ నిర్ణయించి, కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయడంతో వారే ఇంటింటికీ తిరిగి ఇళ్లకు ఫైబర్నెట్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. 2019 మార్చి నాటికి 17 లక్షల కనెక్షన్లు ఇచ్చింది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 



కోటికి పెంచడమే లక్ష్యం : వైఎస్సార్సీపీ హయాంలో ఫైబర్నెట్ పడకేసింది. ఐదేళ్లలో 17 లక్షల కనెక్షన్లు కాస్తా 5 లక్షలకు దిగజారాయి. సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గింది. గత ప్రభుత్వ నేతల అవినీతి అక్రమాలతో సంస్థను పీకల్లోతు అప్పుల్లో ముంచి ఫైబర్నెట్ను దివాలా అంచులకు నెట్టారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఫైబర్నెట్కు పూర్వవైభవం తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, సంస్థ చైర్మన్ జీవీరెడ్డి కనెక్షన్ల సంఖ్యను కోటికి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. గత ప్రభుత్వం పెంచిన ప్లాన్ల ధరలు తగ్గించి నెలకు రూ.149 బేసిక్ ప్లాన్ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్ లోపు కొత్త బాక్సుల కొనుగోలు సహా అసరమైన సాంకేతికత, మానవ వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఫైబర్నెట్ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు. జగన్ హయాంలో వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో పనిచేసే వారికి సంస్థలో పోస్టులిచ్చి వేతనాలిచ్చారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హత లేని 600 మందిని తొలగించి ఆ డబ్బును ఆదా చేశారు. వారి స్థానంలో సమర్థత కల్గిన వారిని విధుల్లోకి తీసుకోనున్నారు. ఇప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభించారు. విద్యా సంస్థల్లోనూ ఫైబర్నెట్ సేవల్ని విస్తరించాలని భావిస్తున్నారు.గత ప్రభుత్వం పెంచిన ప్లాన్ల ధరలు తగ్గించి నెలకు రూ.149 బేసిక్ ప్లాన్ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్ లోపు కొత్త బాక్సుల కొనుగోలు సహా అసరమైన సాంకేతికత, మానవ వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఫైబర్నెట్ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు. జగన్ హయాంలో వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో పనిచేసే వారికి సంస్థలో పోస్టులిచ్చి వేతనాలిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హత లేని 600 మందిని తొలగించి ఆ డబ్బును ఆదా చేశారు. వారి స్థానంలో సమర్థత కల్గిన వారిని విధుల్లోకి తీసుకోనున్నారు. ఇప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభించారు. విద్యా సంస్థల్లోనూ ఫైబర్నెట్ సేవల్ని విస్తరించాలని భావిస్తున్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #fibernet #connection #lowcost #todaynews #flashnews #latestupdate