Header Banner

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

  Fri Apr 18, 2025 19:45        Politics

అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారు. మే 2న ప్రధాని అమరావతి షెడ్యూల్ ఖరారు చేస్తూ ప్రభుత్వానికి సమాచారం అందింది. ప్రధాని పర్యటన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారీ బహిరంగ సభకు నిర్ణయించింది. ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీ నియమించింది. ఇక, ప్రధాని పర్యటన వేళ రైతులు.. మహిళలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సమాయత్తం అవుతున్నారు.

ప్రత్యేక కమిటీ
ప్రధాని పర్యటన కోసం ప్రభుత్వం మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ నియమించింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొల్లు రవీంద్రలతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటైంది. ప్రధాని పర్యటన కోసం నోడల్ అధికారిగా వీర పాండ్యన్​ను నియమించింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు నిర్మాణ పనుల శంకుస్థాపన, పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది. ప్రధాని పర్యటన వేళ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పూలతో రైతుల స్వాగతం
మోదీ సభకు సుమారు 5 లక్షల మంది పాల్గొనేలా, ప్రధాన వేదిక వద్ద 50 వేల మంది కూర్చునే లా, లక్ష మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేలా ప్లానే చేస్తున్నారు. మే 2న సాయంత్రం 4 గంటలకు అమరాతి పనులను ప్రధాని మోదీ ప్రారంభించ నున్నారు. సచివాల యం వెనక ఏర్పాటు చేస్తున్న బహిరంగసభ వేదిక వద్ద నుంచే పనులను ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా వీఐపీలతో పాటు ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 9 రహదార్ల ను గుర్తించారు. పీఎం మోదీతో పాటు ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు అవసరం కాగా, సచివాలయం ఎదుట ఇప్పటికే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేస్తున్నారు. హెలీప్యాడ్‌ నుంచి వేదిక వరకు ఇరు వైపులా రైతులు, మహిళలు నిలబడి పీఎం మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలకేలా నిర్ణయించారు.


ఇది కూడా చదవండివైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Amaravati #PMModiVisit #ModiInAmaravati #AmaravatiDevelopment #GrandWelcomeModi