ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో చుట్టాలు ... వాళ్ళతో చిక్కులు విడకులదాక ...
Tue Nov 10, 2020 12:33 Rachanalu (రచనలు)డాలస్ సిటీ గ్రూప్ జాబ్ అయ్యాకా, అన్ని అప్పులు పోను నా దగ్గర ఓ పది లక్షలు మిగిలాయి. అవి పెట్టి ఓ అపార్ట్మెంట్ విజయవాడలో తీసుకున్నాము. మిగతాది లోన్ తీసుకున్నాం. లోన్ కోసం క్రెడిట్ చెక్ చేస్తే చికాగోలో రామస్వామి నా పేరు మీద తీసుకున్న రెంటల్ అపార్ట్మెంట్ కి మనీ కట్టలేదని వచ్చింది.
నాకు ఎవరితో చెప్పాలో తెలియక రామస్వామి వైఫ్ మాధవి అక్క బాబాయ్ నవనీత కృష్ణ గారి నెంబర్ నెట్ లో వెదికి ఆయనకు వివరం చెప్పాను. అప్పటికి రామస్వామికి ఉన్నదంతా పోయిందట. మరదలి ఇంట్లో ఉంటున్నారని చెప్పి, మాధవితో మాట్లాడతావా అని అడిగారు. ఆయనతో మాట్లాడను కదండి,అక్కంటే నాకెంత ఇష్టమైనా అక్కతో కూడా మాట్లాడలేను, అది పద్ధతి కాదు అని చెప్పాను.
తర్వాత నవనీత కృష్ణ గారు రామస్వామితో మాట్లాడితే, నన్ను బాగా తిట్టాడట. ప్రోబ్లం మాత్రం సాల్వ్ చేయించారు. ఈరోజు ఆయన లేకపోయినా ఆయన నాకు చేసిన హెల్ప్ మర్చిపోలేను. నేను ఇండియా తిరిగి వచ్చిన కొత్తలో మా కోటేశ్వరరావు మామయ్య కోసం మా ఊరు వచ్చినప్పుడు, హంసలదీవి సముద్రం దగ్గర కలిసారు.
డాలస్ లో ఉన్నప్పుడు చేసిన బేబి సిట్టింగ్ డబ్బులు, ఇంకా కొన్ని డబ్బులు కలిపి మా ఊరు దగ్గర కోడూరులో కడుతున్న సాయిబాబా గుడిలో విగ్రహానికి విరాళంగా ఇచ్చాము. అంతకు ముందు అయ్యప్ప గుడికి కూడా అదే ఊరిలో వినాయకుడి గుడికి ఇచ్చాము. ఇండియాలో కొందరు వెధవలు..
ఆఁ మనం అంత డబ్బులు ఇచ్చేపాటివారమా అని ఈయనకు లేనిపోని మాటలు చెప్పారు. ఓ రోజు పొద్దుట వాల్మార్ట్ కి ఏదో ఫోటో పిల్లలది లామినేట్ చేయడానికి ఇచ్చివద్దామంటే నేను రడి అయ్యి వచ్చేసరికి ఈయన ఫోన్ గుడగుడా మాట్లాడుకుంటున్నాడు. నేను వచ్చేసరికి ఆపేసాడు.
అప్పటికి చాలాసార్లు అలా చేసి ఉన్నాడు. నాకు బాగా కోపం వచ్చినా తమాయించుకుని సీక్రెట్స్ మాట్లాడటం అయిపోయిందా అన్నాను. దానికి ఎన్ని దెబ్బలంటే...చేతులు, కాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపయెాగించాడు. వెధవల చెప్పుడు మాటలన్నీ మనసులో ఉంచుకున్నాడుగా. ఆ కచ్చి అలా తీర్చుకున్నాడన్నమాట. అంతకు ముందు కూడా అప్పుడప్పుడూ మగవాడి అహంకారం చూపించేవాడు.
మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి నాకేమీ రాదని, నేనేమి చేయడంలేదని చెప్పడం, ఇండియా ఫోన్ చేసి జనాలకి చెప్పడం చేస్తే వాళ్ళు అప్పుడే చెప్పారు. మాకు తెలిసి మంజు ఎప్పుడూ ఖాళీగా లేదు, ఏదోకటి చేస్తూనే ఉంది. మేం చేయలేని పని కూడా తను చేసిందని చెప్పారు. మా ప్రసాద్ అన్నయ్య చూడటానికి వస్తే తనతో ఇదే మాట. తను అదే చెప్పాడు. నేను అమెరికా రాకుండా, డబ్బులు పంపకుండా, చదువు లేకుండా అమెరికా ఎలా వచ్చాడో కాస్త బుర్రున్న వాళ్ళకి తెలుస్తుంది కదా. నెలకి 1500 డాలర్లు ఈయన ఫోన్ బిల్, బట్టలు డ్రై క్లీనింగ్.
ఇండియాలో ఫ్రెండ్స్ కి డబ్బులు పంపడానికి, బావగారి అప్పు తీర్చడానికి ఈయన సంపాదనెంతో మరి. చెల్లెలి పెళ్లి కి నేనే ఇచ్చాను. మరి ఈయన చేసిన గాస్ స్టేషన్ ఉద్యోగంలో ఖర్చులు పోనూ ఎంత సంపాదన మిగిలిందో మరి. తప్పు నాదే నాకంటూ ఏదీ ఉంచుకోకపోవడం. ఇండియాలో కొన్నవన్నీ లోన్లు, క్రెడిట్ కార్డ్లు గీకి. అంతా నా సంపాదనే..మంజు ఏమీ చేయలేదు అని అందరికి చెప్పడం,..ఇప్పటికి అదే అలవాటు. ఉమావాళ్ళు అట్లాంటా వచ్చాకా, కొడుకు రిషితో మా ఇంటికి వచ్చి రెండు రోజులుండి వెళ్ళారు. మిక్సీ తీసుకువచ్చింది. ఇంకా ఏమైనా కావాలా అంటే ఏమి వద్దన్నాను.
మా తోడికోడలికి H1B వీసా చేసిన శామ్ కంపెనీ డెట్రాయిట్ లో. అప్పటి ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం వాళ్ళు ముగ్గురు డెట్రాయిట్ రావాలి. వాళ్ళతో పాటు నా చిన్న కొడుకు శౌర్యని కూడా తీసుకువచ్చారు. శామ్ ని వాళ్ళని పికప్ చేసుకోమని చెప్పి, డెట్రాయిట్ నుండి నాకు, వాళ్ళకి హంట్స్విల్ టికెట్స్ బుక్ చేసి, నేను డెట్రాయిట్ వెళ్ళాను. ఆరు నెలల పిల్లాడప్పుడు ఇండియాలో అమ్మావాళ్ళ దగ్గర 2004 లో వదిలేసిన శౌర్యని మళ్ళీ 2007 లో చూసానన్నమాట. వాడికి ఏం తెలిసిందో నాకు తెలియదు. నిద్రకళ్ళతోనే చూడగానే చంక ఎక్కేసాడు. శామ్ ఆవిడతో SSN అప్లై చేయించారు. ఆ నైట్ అక్కడ హోటల్ లో ఉండి మరుసటి రోజు అందరం ఫ్లైట్ లో హంట్స్విల్ వచ్చాము.
నేను జాబ్ ఏమి చేయకుండా ఉంది మెుత్తం మీద ఓ సంవత్సరం అంతే. నాకు అప్పటికే బాగా విసుగ్గా ఉండి ఆ ఇయర్ ఇక జాబ్ చేయలేదు. ఓ రోజు వంట చేస్తూ ఆవిడతో అనేసాను. నువ్వు నా పొజిషన్ లో ఉండి, నేను నీలా ఉండి ఉంటే నన్ను అమెరికా తీసుకు వచ్చేదానివి కాదు అని. ఆవిడకి కాసేపు మాట రాలేదు. తర్వాత ఎందుకలా అనుకున్నావు అంది. అది నిజం కనుక అని చెప్పాను. అంతకు ముందు చాలా మాటలు అని ఉన్నారు వాళ్ళు.
నేను ఇండియాలో ఉన్నప్పుడు ఈయన సంవత్సరం కూడా నిండని పెద్దోడు మౌర్యని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, కాస్త గొడవ అయ్యింది. దానికి ఈవిడ గారు సెటిల్ అవ్వకుండా పిల్లల్ని కనకూడదు అని అంది. వాళ్ళ కార్ ఎవరో తీసుకుంటే, మా ఆయన అది అమ్ముకుని అమెరికా వచ్చాడని కూడా అన్నారు. చెల్లెలి పెళ్లికి రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళందరికి వీళ్ళు చాలా మంచివాళ్ళు. మా పెళ్లైన కొత్తలో నేను మద్రాస్ లో జాబ్ చేసేటప్పుడు, ఈయన మద్రాస్ వచ్చి, తమ్ముడికి ఫోన్ ఎన్నిసార్లు చేసినా తీయలేదు. డబ్బులేమైనా అడుగుతాడని భయం. ఇన్ని చేసినా మేం ఏమీ అనలేదు వాళ్ళని.
మా ఆయన తమ్ముడిని షాప్ కి తీసుకువెళ్ళి, తనకి నచ్చిన ఫోన్ కొనిపెట్టాడు. పిల్లలు సైకిల్, స్కేటింగ్ సైకిల్ ఇలా ఏది కావాలన్నా కొనడం చేసారు. ఆవిడ పుట్టినరోజుకి అనుకుంటా చిన్నది హాండ్ బాగ్ కొని ఇస్తే, తర్వాత అది నచ్చలేదని మార్చుకుంటానంటే నా క్రెడిట్ కార్డ్ ఇచ్చి షాప్ కి పంపాను. ఏవో కొనుక్కున్నానంది.
నాకు ఆన్ లైన్ లో క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం అలవాటు. మరుసటిరోజో, ఆ తర్వాతో చెక్ చేస్తే 90 డాలర్లు చెప్పులు తీసుకున్నట్టు ఉంది. నేనేమెా పది డాలర్లు పెట్టి కొనడానికి కూడా తటపటాయిస్తాను. అదేమైనా రాంగ్ బిల్ ఏమెానని సుధా 90 డాలర్లు పెట్టి చెప్పులు కొన్నావా అని అడిగాను.
నేను అడిగినప్పుడు ఈయన కూడా ఉన్నాడు. లేకపోతే నామీద ఇంకెన్ని చెప్పేవారో. ఆవిడ దానికి చాలా పెద్ద సీన్ చేసి ఏవో లెక్కలు రాసి ఈయనకు చూపించింది. ముగ్గురు కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి, పిల్లాడిని కూడా నా దగ్గరకి రాకుండా చేయాలని చూసేవారు. ఆవిడ కంపెని గెస్ట్ హౌస్ లో ఉంటే దానికి డబ్బులు నేను కట్టాను. మధ్యలో వచ్చివెళ్ళడానికి టికెట్లు, క్లయింట్ ఇంటర్వ్యూలకు ఫ్లైట్ టికెట్స్ ఇలా ఓ నాలుగు నెలలకు 30000 డాలర్లు ఖర్చు పెట్టించారు. వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ వాడితే ఎక్కువ వడ్డీ పడుతుందట. మనకి పాపం పడదు కదా అందుకని ఎదుటి వారివి వాడేసేవారు. వాళ్ళ జాగ్రత్త అది.
ఈయనకు నేను క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తే అది తమ్ముడికి ఇచ్చాడు. బాంక్ లో డబ్బులు వేయాలంటే తమ్ముడికి డబ్బులిచ్చి, వాళ్ళతో నన్ను వెళ్ళమనేవాడు. సాయంత్రం పూట ఈయన గాస్ స్టేషన్కి వెళ్ళి ఏమి చెప్పి వచ్చేవాడో మరి తమ్ముడు. ఈయన ఇండియాలో కార్ లోన్ కి, ఇంటి లోన్ కి డబ్బులు పంపడం మానేసాడు.
ఏదో మాటల్లో ఈయన తమ్ముడితో అన్నాను. మీ అన్నయ్య మూలంగానే నా హెల్త్ పాడయ్యిందని. ఎవరం ఊహించని మాటన్నాడు. అయితే డైవోర్స్ ఇచ్చేయండి అని. అది విని నాకు నోట మాట రాలేదు. ఆ టైమ్ వస్తే నువ్వే దగ్గరుండి ఇప్పిద్దువులే అని ఊరుకున్నాను. దేవుడు ఎక్కడైనా జంటలను అటు ఇటుగా కలుపుతాడు. వీళ్ళు మాత్రం ఇద్దరూ ఒకటే. రూపాయి కోసం అమ్మానాన్నని విడదీయడానికి కూడా వెనుకాడని రకం వీళ్ళు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు పుణ్యాత్ములు. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు
మళ్ళీ కలుద్దాం..
గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.
మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or
andhrapravasi@andhrapravasi.com
ముందు వారాల లింకులు
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త జాబ్ ... అన్ని దేశాల వారితో ప్రాజెక్ట్ ... అనుభవాలు ...31
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో వీసా ... అమెరికన్ ఎంబసి లో ముప్పు తిప్పలు ... 30
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉగాది పండగ ... వీసా స్టాంప్ కోసం ప్రయత్నాలు ... 28
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త పరిచయాలు ... 27
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో డెలివరీ తర్వాత పెరిగిన ఖర్చులు, అప్పులు తీర్చటానికి ... 26
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో సర్జరీ ... చావు వరకు తీసుకువెళ్ళింది ... 25
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే... 22
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే... 21
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4
రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...
తెలుగు ప్రవాసుల కు ఉపయోగపడే వార్తలు, వారికి సంభందించిన వార్తలు, ఆయా దేశాల లో వారికి సంభందించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే...
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Andhra pravasi ఆంధ్ర ప్రవాసి
Pulse of Telugu Migrants తెలుగు ప్రవాసుల జీవ నాడి
https://t.me/joinchat/G6eU_lFHk6AH_IG8zfJqdg
https://chat.whatsapp.com/Jd5iZoDyMjfKhVU2IvOe5f
#తెలుగు-ప్రవాసి
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.