మళ్లీ తుపాను.. ఆంధ్రప్రదేశ్‌కి IMD అలర్ట్! రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం - ఆ జిల్లాల వారు జాగ్రత్త!

Header Banner

మళ్లీ తుపాను.. ఆంధ్రప్రదేశ్‌కి IMD అలర్ట్! రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం - ఆ జిల్లాల వారు జాగ్రత్త!

  Mon Nov 18, 2024 09:28        Environment

ఆంధ్రప్రదేశ్ రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. అసలే ఇప్పుడు వారు వరి కోతలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత వాతావరణ శాఖ (IMD) షాకింగ్ విషయం చెప్పింది. బంగాళాఖాతంలో ఒక తుపాను వచ్చే అవకాశం ఉంది అని తెలిపింది. అందుకు సంకేతాలు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కనిపిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం అక్క ఒక ఆవర్తనం ఏర్పడుతోంది. ఆ ఆవర్తనం క్రమంగా బలపడుతూ.. ఈ నెల 23 నాటికి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని IMD అంచనా వేసింది. ఆ అల్పపీడనం క్రమంగా బలపడుతూ.. పశ్చిమం, వాయవ్య దిశగా కదులుతుందనీ.. ఆ తర్వాత అది మరింత బలపడి.. తుపానుగా మారే ఛాన్స్ కూడా ఉంది అని IMD ఆంటోంది. చివరకు అది నవంబర్ 26, 27 తేదీల్లో శ్రీలంకకు ఉత్తరం వైపుగా వస్తుందని IMD సూచిస్తోంది. ఈ తుపాను ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతోపాటూ.. వాటిలోనే భాగమైన ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే.. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై కూడా తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు.

 

ఇంకా చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్! ఆ జిల్లాల వారికి భారీ వర్ష సూచన!

 

ఈ హెచ్చరికలను లెక్కలోకి తీసుకొని.. రైతులు.. తుపాను వచ్చే లోపే.. వరి కోతలను పూర్తి చేసుకోవడం మంచిదే. అలాగే.. వరిని బయట ఆరబెడితే.. వర్షం వచ్చే లోపే.. వాటిని అక్కడి నుంచి తరలించడం మేలు. తుపాను వస్తే, వర్షం పడితే.. వరి ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం వరి కొనుగోళ్లను ప్రారంభించింది కాబట్టి.. రైతులు త్వరగా కోతలు చేపట్టి.. అమ్ముకునేలా ప్లాన్ చేసుకుంటే, వర్షం నుంచి తప్పించుకున్నట్లు అవుతుంది. చేపల వేటకు వెళ్లేవారు కూడా తుపానును లెక్కలోకి తీసుకొని ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతం బంగాళాఖాతంలో గాలి వేగం ఎక్కువగా ఉంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్తే.. ప్రమాదమే. బోట్లను తిరగేసేంత గాలి వీస్తోంది. అందువల్ల జాలర్లు జాగ్రత్తగా ఉండాలి. ఇక నేటి వాతావరణం చూస్తే.. ఏపీ, తెలంగాణలో ఎండ వాతావరణమే ఉంటుంది. కానీ ఎండ సమస్యగా అనిపించదు. మేఘాలు పెద్దగా ఉండవు. గాలి మాత్రం బాగా వీస్తుంది. రాత్రి అయ్యే కొద్దీ చల్లదనం బాగా పెరుగుతుంది. అర్థరాత్రి తర్వాత చలి మరింత ఎక్కువ అవుతుంది. ప్రయాణాలు చేసేవారికి ఇవాళ చాలా బాగుంటుంది. ఎక్కడా చినుకులు పడే అవకాశాలు లేవు.

 

ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

 

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

 

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather