స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు! భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు!
Thu Nov 21, 2024 13:28 Businessదేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం, విదేశీ నిధుల ఉపసంహరణ నేపథ్యంలో గురువారం బెంచ్‌మార్క్ సూచీలు మరోసారి పతనమవుతున్నాయి. వరుస ఏడు సెషన్లలో నష్టాల అనంతరం మంగళవారం లాభాలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 468.17 పాయింట్లు పతనమై.. 77,110.21 వద్ద మొదలైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 179.75 పాయింట్లు పతనమై.. 23,338.75 పాయింట్ల వద్ద షురూ అయ్యింది. సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ విషయంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో వారెంట్ జారీ అయ్యింది.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
అదానీతో పాటు ఏడుగురు యూఎస్‌లో బిలియన్ డాలర్ల విలువైన లంచం ఇవ్వడంతో పాటు మోసానికి పాల్పడ్డట్లుగా ఆరోపణలున్నాయి. ఈ విషయంలో అమెరికా కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో అదానీ, ఆయన మేనల్లుడిపై వారెంట్లు జారీ అయ్యాయి. అమెరికా, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ.వేలకోట్ల సంపదను ఆకర్షించినట్లు గౌతమ్ అదానీపై అభియోగాలను నమోదు చేశారు. ఈ క్రమంలో సెన్సెక్స్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్ 10 శాతం పడిపోయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌తో సహా ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్ సైతం ప్రారంభ ప్రారంభంలోనే భారీగా పతనమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్ సైతం నష్టాల్లో ఉన్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎస్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ, టెక్ మహీంద్రా లాభాల్లో ఉన్నాయి. మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) రూ.3,411.73 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ పతనమైంది. అమెరికా మార్కెట్లు ఎక్కువగా పాజిటివ్ జోన్‌లో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.25 శాతం పెరిగి 72.99 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 556.15 పాయింట్లు పతనమై.. 77,022 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 191.15 పాయింట్లు పతనమై.. 23,327.17 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Business #Stocks #StockMarkets #MarketCrash
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.