పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

Header Banner

పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

  Thu Aug 22, 2024 19:47        Travel

భారత్తో సహా 35 దేశాల పౌరులకు ఆరు నెలల పాటు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ విధానానికి తెరతీసినట్టు శ్రీలంక పర్యాటక మంత్రిత్వ శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో తెలిపారు. శ్రీలంక జాబితా చేసిన దేశాల్లో చైనా, జర్మనీ ఆస్ట్రేలియా వంటి ప్రధాన దేశాలతో పాటు, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ వంటి పశ్చిమాసియా దేశాలు కూడా ఉన్నాయి. అంతేగాక జపాన్, ఫ్రాన్స్, కెనడా దేశాలకు కూడా అవకాశమిచ్చింది.

 

ఇంకా చదవండిజగన్ కు జర్క్ ఇచ్చిన సీబీఐ! కోర్టులో సీబీఐ కౌంటర్ తో మాజీ సీఎం షాక్! 

 

ఇంకా చదవండికొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్ట్ను గతేడాది అక్టోబర్లో శ్రీలంక ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్ట్ గడువు మార్చి 2024లో ముగిసింది. ఇప్పుడు మరిన్ని దేశాలను ఇందులో భాగం చేసింది. శ్రీలంకలో ఆన్-అరైవల్ వీసాల కోసం పెరిగిన రుసుములను ఒక విదేశీ కంపెనీ నిర్వహిస్తుందనే వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, శ్రీలంకకు వచ్చే సందర్శకులలో 60 శాతం భారత్ నుంచే వెళ్లడం గమనార్హం.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్ఆయనే మాకు హీరోమంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Travel #Srilanka #VisaFreeTravel #VisaFree