మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పు! భక్తులకు తితిదే కీలక ప్రకటన!

Header Banner

మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పు! భక్తులకు తితిదే కీలక ప్రకటన!

  Fri Dec 20, 2024 20:43        Devotional

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేసినట్లు తితిదే పేర్కొంది.



ఇంకా చదవండిసీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!



మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబరు 25న ఉదయం 11 గంటలకు, మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను సైతం విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తితిదే పేర్కొంది. ఈ మార్పును భక్తులు గమనించాలని.. తితిదే వెబ్సైట్ https://ttdevasthanams. ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు సూచించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకాబెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #ttd #thirumala #tickets #thirupathi #tokens #todaynews #flashnews #latestupdate