భువనమ్మ రాకతో మెరిసిపోతున్న కుప్పం! ముఖ్యమంత్రి భార్యగా కాదు.. ప్రతి 3 నెలలకూ!

Header Banner

భువనమ్మ రాకతో మెరిసిపోతున్న కుప్పం! ముఖ్యమంత్రి భార్యగా కాదు.. ప్రతి 3 నెలలకూ!

  Sun Dec 22, 2024 19:28        Politics

నిత్యం ప్రజల గురించే తపించే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనలో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి గెలవడంతో రాక్షస పాలనకు అడ్డుకట్ట పడిందని అన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో 4వ రోజున రామకుప్పం మండలంలోని చల్దిగానిపల్లిలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో భువనేశ్వరి పాల్గొన్నారు. అనంతరం పలమనేరు నియోజవర్గం వి. కోటలో హెరిటేజ్ సహాయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గానికి వచ్చి అభివృద్ధి పనులను దగ్గరుండి చూసుంటానని... మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవడం నా బాధ్యత. అటు మంగళగిరిపై నారా లోకేశ్, ఇక్కడ కుప్పం అభివృద్ధిపై నేనూ ఫోకస్ చేశాము. నేను ఇక్కడికి ముఖ్యమంత్రి భార్యలా రాలేదు... టీడీపీ కార్యకర్తగా వచ్చాను. 

 

ఇంకా చదవండి: అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

చంద్రబాబు గారు పదేపదే మీ గురించి చెబుతున్నారు. ప్రతి రోజూ కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు గారి మీద అక్కసుతో కుప్పంలో అభివృద్ధి అన్న మాట వినబడకుండా చేసింది. ఇకపై మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుప్పం అభివృద్ది కోసం చంద్రబాబు గారు 40 పథకాలు తెచ్చారు. ప్రతి గ్రామానికి రహదారులు, డ్రైనేజ్, అందరికీ సొంత ఇళ్లు , ఉపాధి కల్పన సహా అన్నింటిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాము. కుప్పం నుంచి ఇకపై వలసలు కూడా ఉండవు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సహా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. మీకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను నాలుగు రోజులుగా ప్రతి మీటింగ్ లో నూ మహిళల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను. స్త్రీలు శక్తిమంతులు. మగవారిని మించి పనిచేయగలరు.

 

ఇంకా చదవండి: డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

నేను ఇది చేయలేను అనే భయం లేకుండా ముందడుగు వేయాలి. అప్పుడే అద్భుతాలు సాధించగలరు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, నా నిజం గెలవాలి యాత్ర సమయంలోనూ రాష్ట్రమంతటా మహిళలు నాకు అండగా నిలిచారు. నాకు కొండత ధైర్యాన్నిచ్చి నాలో స్పూర్తిని నింపారు. మీరుణం తీర్చుకోలేము. మీకు అభివృద్ధి ఫలాలు అందేలా చేయడమే మేము చేయగలము. రామకుప్పం మండలం చల్దిగానిపల్లి రహదారి పక్కన భువనేశ్వరి గారిని కలవడం కోసం టీడీపీ మహిళా కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చారు. వారంతా పసుపు రంగు చీరలు ధరించి జై తెలుగుదేశం అని రాసి ఉన్న కళ్లజోళ్లు పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిని చూడగానే భువనేశ్వరి గారు కారు దిగి ఆప్యాయంగా పలకరించారు. వారు ఇచ్చిన చీర, పసుపు కుంకుమను స్వీకరించారు.


ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ!

 

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి! విద్యార్థి సంఘాల ఆందోళన!

 

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss

 

వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..

 

అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!

 

అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!

 

ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

 

నేడు (21/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews