రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని 4 తినండి! ఎంతో ఆరోగ్యంగా ఉంటారు!

Header Banner

రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని 4 తినండి! ఎంతో ఆరోగ్యంగా ఉంటారు!

  Sun Dec 22, 2024 19:41        Health

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డ‌మే కాదు, జంక్ ఫుడ్ తిన‌డం త‌గ్గించాలి. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతాము. కానీ ప్ర‌స్తుతం చాలా మంది వ్యాయామం చేయ‌డం లేదు. అలాగే త‌ర‌చూ జంక్ ఫుడ్‌ను తింటున్నారు. ఇది అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. అయితే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తిన‌డం అంటే చాలా మందికి క‌ష్టంగా ఉంటుంది. కానీ కొన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు అలా కాదు, ఎంతో రుచిగా ఉంటాయి. పైగా అనేక పోష‌కాల‌ను అందిస్తాయి. మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప‌లు వ్యాధుల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అలాంటి ఆహారాల్లో యాప్రికాట్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు మార్కెట్‌లో ఎక్కువ‌గా డ్రై ఫ్రూట్స్ రూపంలో ల‌భిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. యాప్రికాట్స్ ను రోజూ ఉద‌యం 4 తింటే మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి.

 

జీర్ణ వ్య‌వ‌స్థ‌కు..
యాప్రికాట్స్‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు. నిత్యం చాలా మంది గంట‌ల త‌ర‌బ‌డి టాయిలెట్‌లో విరేచ‌నం అవ‌క కాలం గ‌డుపుతుంటారు. అలాంటి వారు యాప్రికాట్ ల‌ను తిన‌డం వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. యాప్రికాట్‌ల‌ను తింటే జీర్ణాశ‌యం, పేగులు క్లీన్ అవుతాయి. అలాగే గ్యాస్‌, అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. క‌డుపు ఉబ్బ‌రం, అజీర్తి సైతం త‌గ్గుతాయి. యాప్రికాట్స్‌లో విట‌మిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి మ‌న చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చ‌ర్మ క‌ణాల‌ను రిపేర్ చేస్తాయి. దీంతో చ‌ర్మం పొడిబార‌డం త‌గ్గుతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. క‌నుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో యాప్రికాట్‌లను తింటుండాలి.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి..
అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి యాప్రికాట్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే క్యాల‌రీలు ఎక్కువ‌గా చేర‌వు. పైగా ఎక్కువ సేపు ఉన్నా క‌డుపు నిండిన భావ‌నతో ఉంటారు. ఆక‌లి వేయదు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఫ‌లితంగా ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. క‌నుక అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న వారు రోజూ ఉద‌యం యాప్రికాట్స్ ను తింటుంటే ఫ‌లితం ఉంటుంది. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. డ్రై యాప్రికాట్స్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. శ‌రీరంలోని సోడియం స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు.

 

కంటి చూపు పెరుగుతుంది..
యాప్రికాట్స్ లో బీటా కెరోటిన్ స‌మృద్ధిగా ఉంటుంది. అందుక‌నే యాప్రికాట్స్ నారింజ రంగులో ఉంటాయి. ఇక ఈ పండ్ల‌ను తింటే యాప్రికాట్స్‌లో ఉండే బీటా కెరోటిన్ మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. కళ్లు పొడిబార‌డాన్ని త‌గ్గిస్తుంది. క‌ళ్ల‌పై ప‌డే ఒత్తిడి సైతం త‌గ్గుతుంది. కంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. కొంద‌రు ఉద‌యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి అల‌స‌ట‌గా ఉంద‌ని, నీర‌సంగా ఉంద‌ని చెబుతుంటారు. అలాంటి వారు ఉద‌యాన్నే శ‌క్తి స్థాయిలు పెర‌గాలంటే యాప్రికాట్స్‌ను తింటుండాలి. దీని వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. ఇలా యాప్రికాట్స్‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తిన‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

  

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుఅప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Diet #Apricots #Foods #DryFruits