పూరీ జగన్నాథ ఆలయంలో కొత్త విధానం! ఇక ఆ ఇబ్బందులు తప్పినట్లే!

Header Banner

పూరీ జగన్నాథ ఆలయంలో కొత్త విధానం! ఇక ఆ ఇబ్బందులు తప్పినట్లే!

  Sun Dec 22, 2024 21:42        Devotional

ఒడిశాలో ప్రముఖ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం, ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయితే భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూరీ జగన్నాథ ఆలయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భక్తులకు దర్శనం కోసం సరికొత్త విధానానికి ఒడిశా సర్కార్ శ్రీకారం చుట్టనుంది. ఈ కొత్త దర్శన విధానం జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఒడిశా న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఆదివారం వెల్లడించారు. 

 

పూరీ జగన్నాథ్ ఆలయంలో కొత్త దర్శన విధానం కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఒడిశా మంత్రి తెలిపారు. వీటికి సంబంధించిన పనులు, ఏర్పాట్లు ఈనెల 27, 28 వ తేదీల్లోగా పూర్తి అవుతాయని వెల్లడించారు. డిసెంబర్‌ 30, 31వ తేదీల్లో పూరీ జగన్నాథ్ ఆలయంలో ప్రయోగాత్మకంగా ఈ కొత్త దర్శన విధాన్ని ప్రారంభించనున్నట్లు పృథ్వీరాజ్ హరిచందన్ స్పష్టం చేశారు. ఆ తర్వాత వచ్చే జనవరి 1వ తేదీ నుంచి కొత్త దర్శన విధానం పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకురానున్నట్లు తేల్చి చెప్పారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

ఈ కొత్త దర్శన విధానంలో పూరీ జగన్నాథ ఆలయానికి వచ్చే మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. ఈ కొత్త విధానంలో భక్తులు ప్రస్తుతం ఉన్న ద్వారం (సత్పహచ) నుంచి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశిస్తారని చెప్పారు. దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు బయటికి వెళ్లేందుకు రెండు వేర్వేరు దారులు ఉంటాయని తెలిపారు.

 

ఇక ఈ కొత్త దర్శన విధానానికి సంబంధించిన పనులను జగన్నాథ ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి అరబింద పాడి స్వయంగా తిరిగి సమీక్షించారు. భక్తుల రద్దీ కారణంగా పూరీ జగన్నాథ ఆలయం గర్భగుడిలో కొలువైన దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులకు తరచుగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వాటిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

 

ఈ సరికొత్త దర్శన విధానంలో నాట్య మండపంలో 6 వరుసల్లో ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ పనుల కోసం ఒడిశా బ్రిడ్జి అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను నియమించి.. ఈ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేస్తామని అరబింద పాడి స్పష్టం చేశారు. ఇక ఈ కొత్త దర్శన పనుల కారణంగా రత్న భండార్ మరమ్మతు పనులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. రత్నా భండార్ పునరుద్ధరణ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్ఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

  

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుఅప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Devotional #Puri #JagannathTemple #PuriJagannath #PuriJagannathTemple #Odissa #India #Piligrims #Temples #Visitors