అమెరికా: చికాగోలో ‘ఎన్టీఆర్ వర్ధంతి’ ఘన నివాళి! ఎన్ఆర్ఐ టీడీపీ! పాల్గొన్న ప్రముఖులు

Header Banner

అమెరికా: చికాగోలో ‘ఎన్టీఆర్ వర్ధంతి’ ఘన నివాళి! ఎన్ఆర్ఐ టీడీపీ! పాల్గొన్న ప్రముఖులు

  Wed Jan 24, 2024 12:40        Associations, U S A

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చికాగో నగరంలో ఎన్ఆర్ఐ టీడీపీ చికాగో కమిటీ మరియు స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు హేమ కానూరు ఆధ్వర్యంలో ఎన్నారైలు అందరూ అన్న గారికి ఘనంగా నివాళులు అర్పించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల్ ఆఫ్ ఇండియా ఓనరు, 14 రీల్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ సుంకర , చంద్రశేఖర్ పెమ్మసాని, రామకృష్ణ గుళ్లపల్లి తదితరులు విచ్చేసారు.


అతిథుల చేతుల మీదగా అన్న గారికి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభం అయ్యిన ఈ కార్యక్రమంలో వివిధ వక్తలు ప్రసంగిస్తూ ఎన్టిఆర్ తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు.

 

తరాలు మారినా, యుగాలు గడిచిన ఎన్టీఆర్ చరిత్ర తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మనీయంగా నిలిచి పోతుందని అన్నారు. చికాగోలో ఉష్ణోగ్రతలు -12 సెంటిగ్రేడ్ కు పడిపోయిన కూడా అభిమానులు అశేషంగా కుటుంబ సమేతంగా రావడం అన్న గారి మీద అభిమానాన్ని తెలియచేస్తుంది.

 

ఈ కార్యక్రమానికి యుగంధర్ యడ్లపాటి, చంద్రశేఖర్ పెమ్మసాని, అనిల్ సుంకర అధ్యక్షత వహించగా హేమ కానూరు పర్యవేక్షణలో చికాగో ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు రవి కాకర, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెదమల్లు, ట్రెజరీ విజయ్ కొరపాటి, రీజనల్ కౌన్సిల్ చిరంజీవి గళ్ళా, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, శివ త్రిపురనేని, కృష్ణ మోహన్, మూర్తి కొప్పాక, సునీల్ ఆరుమిల్లి, కళ్యాణ్ విష్ణు విలాస్, నాగేంద్ర వేగే, ప్రమోద్ చింతమనేని తదితరులు తమ సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమం విజయవంతం అవ్వడం లో తోడ్పడ్డారు.

 

మీ  వ్యాపార  ప్రకటనల  కొరకు  ఆంధ్ర ప్రవాసి  డాట్  కామ్  AndhraPravasi.com  ఉచితంగా  అందిస్తున్న  క్లాసిఫైడ్స్  Classifieds  లో  ప్రకటించుకొని  మీ  వ్యాపారాన్ని  అభివృధ్ది చేసుకోండి.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AmericaNews #AmerciaUpdates #TeluguMigrants #AndhraMigrants #TelanganaMigranys #IndianMigrants #NorthAmerica #USA #USAUpdates #USANews #associations