మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం! ఇది సోనూసూద్ సేవా గుణం! సోషల్ మీడియాలో హల్ చల్!

Header Banner

మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం! ఇది సోనూసూద్ సేవా గుణం! సోషల్ మీడియాలో హల్ చల్!

  Mon Jul 22, 2024 07:00        Entertainment

బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని, దానగుణాన్ని చాటుకున్నారు. మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం చేసి మరోసారి తాను రియల్ హీరోనని నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన దేవి కుమారి అనే యువతి చదువుకోవడానికి సాయం చేశారు సోనూసూద్. ఆ యువతికి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా బసవనూరుకు చెందిన దేవి కుమారి అనే యువతికి ఉన్నత చదువులు చదవాలనే కోరిక. బీఎస్సీ చదవాలని డిగ్రీ పట్టా అందుకోవాలనే ఆశ. అయితే ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించలేదు. దీంతో చదువుకు దూరమైంది. అయితే.. తన చదువుకు సాయం చేయాలని అభ్యర్థిస్తూ దేవి కుమారి సాయం కోరింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దేవి కుమారికి సాయం చేయాలంటూ సోనూసూద్‌ను ఆ వీడియోకు ట్యాగ్ చేశారు. ఈ వీడియో సోనూసూద్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్పందించారు. నీ చదువు ఆగదు. కాలేజీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు, నీకు నచ్చిన కాలేజీలో జాయిన్ చేయించే బాధ్యత నాది అంటూ ఆమెకు భరోసా ఇచ్చారు సోనూసూద్. ఈ విషయాన్ని తెలియజేసేలా ఈ ట్వీట్‌కు జులై 19న రిప్లై ఇచ్చారు.

 

ఇంకా చదవండి: ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ న‌టి! ప్రస్తుతం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో!

 

దీంతో దేవి కుమారి కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోనూసూద్ స్పందనపై నెటిజనం కూడా ప్రశంసలు కురిపించారు. అయితే సాయం చేస్తానని జులై 19న మాట ఇచ్చిన సోనూసూద్.. 24 గంటలు కూడా గడవకముందే తన మాట నిలబెట్టుకున్నారు. దేవి కుమారికి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. " నీ అభిమానానికి, ప్రేమకు ధన్యవాదాలు, బాగా చదువుకో, నీ కాలేజీ అడ్మి్షన్ పూర్తైంది. మీ కుటుంబం గర్వపడేలా చేయ్ అంటూ.. సోనూసూద్ ట్వీట్ చేశారు. అలాగే గైడెన్స్ అందించినందుకు ధన్యవాదాలు అంటూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేశారు. ఇది చూసిన నెటిజనం సోనూసూద్ తాను రియల్ హీరోనని మరోసారి నిరూపించుకున్నారని కామెంట్లు పెడుతున్నారు. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చి సోనూసూద్ మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. సోనూ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు, పేదలకు సాయం చేస్తున్నారు.



ఇంకా చదవండి: ఏపీలో రికార్డు స్థాయిలో ఐఏఎస్ ల బదిలీ! ఒకేసారి 62 మంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేను అంబానీ చుట్టాన్ని కాదా? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని..జ్యోతిరెడ్డి

 

సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?

 

శవ రాజకీయాలు చేయడం జగన్‌ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!

 

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

ఏపీకి శుభవార్తను వినిపించిన కేంద్ర ప్రభుత్వం! విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్!

 

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

 

రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!

 

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Actor #Bollywood #Tollywood #Helping #SocialMedia #Sonusood