ఇది షూటింగ్ కాదు.. అతి తెలివి ప్రదర్శించొద్దు! నటుడు విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం!

Header Banner

ఇది షూటింగ్ కాదు.. అతి తెలివి ప్రదర్శించొద్దు! నటుడు విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం!

  Fri Aug 02, 2024 15:23        Entertainment

‘‘ఇది షూటింగ్ కాదు.. అతి తెలివి ప్రదర్శించవద్దు’’ అంటూ కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా తీస్తానని విశాల్ తమ నుంచి రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడని, ఆ డబ్బులు ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా లైకా సంస్థకు విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తి వివరాలను సమర్పించాలని విశాల్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు ఆయన నటించి, నిర్మించిన సినిమాలేవీ థియేటర్లలో కానీ, ఓటీటీల్లో కానీ విడుదల చేయకుండా స్టే విధించింది. అయితే, కోర్టు తీర్పును ఉల్లంఘించారని, డబ్బులు డిపాజిట్ చేయకపోవడమే కాకుండా ఆయన నటించి, నిర్మించిన సినిమాలను కూడా విడుదల చేశారంటూ ఈ ఏడాది జూన్‌లో లైకా సంస్థ మరోమారు కోర్టును ఆశ్రయిస్తూ విశాల్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేసింది. అయితే, అప్పుడు ఆధారాలను చూపించడంలో సంస్థ విఫలం కావడంతో విచారణ పలుమార్లు వాయిదా పడింది.

 

తాజాగా, ఈ కేసులో గురువారం విశాల్ తన వాదనలు వినిపించేందుకు కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా లైకా సంస్థతో జరిగిన ఒప్పందంపై విశాల్‌ను కోర్టు ప్రశ్నించింది. అయితే, అది తన దృష్టికి రాలేదని, ఖాళీ పేపర్‌పై సంతకం మాత్రమే చేశానని బదులిచ్చారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ కాగితంపై మీరెలా సంతకం చేస్తారని ప్రశ్నించారు. తెలివిగా సమాధానం చెబుతున్నానని అనుకోవద్దని, ఇది మీ సినిమా షూటింగ్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తెలివి ప్రదర్శించవద్దని, జాగ్రత్తగా బదులివ్వాలని సూచించారు. ఆ తర్వాత ‘పందెంకోడి 2’ విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారా? అని కోర్టు ప్రశ్నించగా.. విశాల్ సమాధానం ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు.  దీంతో న్యాయమూర్తి మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రవర్తిస్తే కుదరదని, అవుననో, కాదనో సమాధానం చెప్పాలని ఆదేశించారు. దీంతో విశాల్ నోరు తెరిచారు. లైకా నుంచి డబ్బు అప్పుగా తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. దీంతో కేసు విచారణను నేటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.


ఇంకా చదవండి: నటుడు రఘుబాబు: పాతికేళ్ల పాటు నాన్న సంపాదించిందంతా తుడిచిపెట్టుకుపోయింది! 1990లో విడుదలైన సినిమా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

 

రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!

 

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!

 

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!


 

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతి, పోలవరం తరువాత, అంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యత?

 

ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!

 

కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!

 

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

 

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

 

పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!

 

ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Vishal #Kollywood #Madrash #HighCourt #LycaProductions