పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!

Header Banner

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!

  Sun Sep 01, 2024 11:00        Entertainment

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా, హైప్ ఉందో పక్కన పెడితే… ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజీత్. ఇక ఒక్క గ్లింప్స్‌తో కేవలం టాలీవుడ్‌ను మాత్రమే కాదు.. యావత్ ఇండియాను ఒక ఊపు ఊపేశాడు. పవన్‌ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా.. అభిమానులు మాత్రం కాస్త ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంది ఓజీ సినిమాపైనే. అర్థం చేసుకోలేక ఫ్లాప్‌ చేశామే కానీ.. సాహో సినిమా రేంజ్‌ వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి సుజీత్‌ నుంచి ఐదేళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్‌ కళ్యాణ్‌తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారా స్థాయిలోనే ఉంటాయి. బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే వాళ్ల సంతోషం ఏలా ఉంటుందో.. ఓజీ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువే ఆనందంతో ఉన్నారు. ఇన్నాళ్లు రీమేక్ సినిమాలతో చచ్చుబడిపోయిన నాలుకకు, ఓజీ అంటూ అసలైన ఘాటును అంటించాడు సుజీత్. నిజానికి అన్ని అనుకున్నట్లుగా కుదిరితే.. ఈ పాటికే ఓజీ ఫీవర్ ఇండియాను తాకేసేది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

 

ఇంకా చదవండి: రాజకీయాల్లోకి రావడమే బెటర్ అనిపిస్తోంది.. వస్తా! విషయం ఏదైనా నిజాయతీగా మాట్లాడతానన్న విశాల్!

 

 కానీ పవన్ రాజకీయాలతో బిజీ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. దాంతో సినిమాను పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేసిన విషయం చెప్పారు కానీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు. కాగా తాజాగా నిర్మాత దానయ్య ఈ సినిమా రిలీజ్‌పై ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 2025 లోపే రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఈ దెబ్బతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. మరో 7 నెలలో అసలైన తుఫాన్ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు ‘పంజా’ సినిమాలో అటు ఇటుగా కొంచెం గ్యాంగ్‌స్టర్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్‌ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్‌ క్రియేట్‌ అయింది. కాగా ఒక్క గ్యాంగ్ స్టర్ గానే కాకుండా పవన్ ఈ సినిమాలో 3 విభిన్న క్యారెక్టరైజేషన్ లలో కనిపించనున్నాడట. అదేంటంటే.. ఈ సినిమాలో పవన్ బ్రూటల్ గ్యాంగ్ స్టర్‌గా, లీడర్‌గా, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా ఇలా మూడు విభిన్న రోల్స్‌లో కనిపించనునున్నాడట. ఇందులో నిజమెతుందో తెలియదు కానీ.. ఈ న్యూస్ విని పవన్ ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సలార్ బ్యూటీ శ్రియా రెడ్డితో పాటు.. అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

ఇంకా చదవండి: రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!

 

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

 

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

 

రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pawankalyan #Movie #OG #Realse #Tolyywood