మీ బ్రెయిన్ షార్ప్ ఉండాలా? అయితే వీటిని ట్రై చేయండి! మెదడుకు పదును పెట్టండి!

Header Banner

మీ బ్రెయిన్ షార్ప్ ఉండాలా? అయితే వీటిని ట్రై చేయండి! మెదడుకు పదును పెట్టండి!

  Tue Nov 26, 2024 11:00        Life Style

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో ఒత్తిళ్లను మెదడు ఎదుర్కొంటుంది. దీని వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడి, చేసే పనిపై ఏకాగ్రత ఉండదు. ఏదైనా విషయం గురించి ఆలోచించాలన్నా లేదా సరైన నిర్ణయం తీసుకోవాలనుకున్నా మెదడు పాత్ర కీలకంగా ఉంటుంది. ఇది అనేక నాడుల సమూహం. అటువంటి మెదడు చురుగ్గా, పవర్ఫుల్ గా పనిచేయాలంటే కొన్నింటిని అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్ల కారణంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. మరి మెదడుకు పదును పెట్టే ఆ అలవాట్లు ఏంటో ఇక్కడ చదివేయండి.

 

వ్యాయామం: శరీరంలో రక్తం సరఫర సరిగా జరగాలంటే వ్యాయమం తప్పనిసరిగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం, జాగింగ్, నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శారీరక వ్యాయామం శరీరాన్ని దృఢంగా మార్చుతుంది. ప్రతి రోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల కొత్త న్యూరాన్ల పెరుగుదలను ఇది ప్రోత్సహిస్తుంది.

 

ఇంకా చదవండినయనతారకు ఇదో పెద్ద అవమానమే! బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో..వీడియో నెట్టింట వైరల్‌!  

 

ధ్యానం: ప్రతి రోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని 10 నుండి 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

 

జర్నలింగ్: జర్నలింగ్ చేయడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. భావోద్వేగాలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. మీ లక్ష్యాలను, ప్రణాళికలు, ఆలోచనలకు 10 నిమిషాలు కేటాయించి రాయడం వల్ల ఆలోచన శక్తి మెరుగుపడుతుంది.

 

సుడోకు: ఇది సమస్య పరిష్కార నైపుణ్యంను మెరుగుపరుస్తుంది. మెదడును పదును పెట్టేందుకు ఇది. సహాయపడుతుంది. క్రాస్వర్డ్ పజిల్ లేదా సుడోకు పరిష్కరించడానికి 10 లేదా 15 నిమిషాలు కేటాయించండి.

 

జిగ్సా పజిల్స్: సాధారణంగా వీటిని ఎక్కువగా చిన్న పిల్లలు ఆడుతుంటారు. కొన్ని ముక్కలన్నింటిని సరైన పద్ధతిలో కలిపితే ఒక ఆకారం వస్తుంది. అదే జిగ్సా పజిల్. వీటిని ఆడడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. మెదడుకు పని చెప్పడం వల్ల మెదడు కణాలు యాక్టివ్గా ఉంటాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

పుస్తకాలు చదవడం: పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఎలాంటి పుస్తకాన్ని అయినా కొంతసేపు చదివడం వల్ల మెదడుకు ప్రశాంతత లభిస్తుంది.

 

పాజిటివ్ థింకింగ్: చాలామంది ప్రతీ చిన్న విషయాన్ని కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి, పాజిటివ్గా ఆలోచించడం వల్ల శరీరంలోని ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు తగ్గిపోతాయి.

 

సంగీతం, డ్యాన్స్: సంగీతం వినడం, డాన్స్ చేయడం వంటివి చేయడం వల్ల మెదడులోని నరాలు ఉత్తేజితం అవుతాయి. దీని వల్ల మెదడు నరాల పనితీరు మెరుగుపడి, క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

 

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

 

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

 

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #LifeStyle #Brain #Smarter #Puzzles #Games