16 ఏళ్ల లోపు వారికి సోషల్‌మీడియా నిషేధం! బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా!

Header Banner

16 ఏళ్ల లోపు వారికి సోషల్‌మీడియా నిషేధం! బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా!

  Wed Nov 27, 2024 14:22        Australia

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏండ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. బిల్లును బుధవారం సభలో ప్రవేశపెట్టగా 102 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. మెజారిటీ పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటెయ్యగా, 13 మంది సభ్యులు మాత్రం వ్యతిరేకించారు. ఇక సెనేట్‌లో ఆమోదం లభించిన వెంటనే బిల్లు చట్టరూపం దాల్చనుంది.

 

ఇంకా చదవండిఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆ వెంటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. 16 ఏండ్ల లోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు 50 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.273 కోట్లకు పైమాటే. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, స్నాప్‌చాట్‌, రెడిట్‌ తదితర మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది. కాగా, బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Australia #Children #Minors #SocialMedia #Government #Ban