యాసిడిటీతో బాధపడుతున్నారా? సహజంగా రిలీఫ్ ఇచ్చే ఫుడ్స్​ ఇవే!

Header Banner

యాసిడిటీతో బాధపడుతున్నారా? సహజంగా రిలీఫ్ ఇచ్చే ఫుడ్స్​ ఇవే!

  Wed Nov 27, 2024 22:16        Life Style

పరిమితికి మించి తినడం, కూల్ డ్రింక్స్ అతిగా తాగడం, కడుపులో అల్సర్లు వంటివాటితో యాసిడిటీ సమస్య తలెత్తుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో ఈ ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. అయితే తరచూ యాసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు... మందులతో ఉపశమనం పొందుతుంటారు. అలాగాకుండా కొన్ని రకాల ఆహారాన్ని తమ డైట్ లో భాగంగా చేసుకుంటే సహజ పద్ధతుల్లో యాసిడిటీని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. 

 

అరటి పండ్లు
అరటి పండ్లు స్వల్పంగా ఆల్కలైన్ (క్షార) స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే యాసిడిటీకి విరుగుడుగా పనిచేస్తాయి. అంతేకాదు అరటి పండ్లలోని పెక్టిన్ అనే ఎంజైమ్... మన జీర్ణాశయం, పేగుల లోపలి పొరపై ఒక రక్షణ పూతలా పేరుకుంటుంది. యాసిడిటీ వల్ల వచ్చే మంట, ఇతర ఇబ్బందులను తగ్గిస్తుంది. 

 

ఇంకా చదవండిఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే! 

 

దోసకాయలు
తరచూ తీసుకునే ఆహారంలో దోసకాయలు కూడా సహజమైన ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉన్నవే. అంతేకాదు వీటిలో నీటి శాతం కూడా ఎక్కువే. అందువల్ల అటు కడుపులోని యాసిడ్లను నిర్వీర్యం చేయడమే కాదు... శరీరం నుంచి బయటికి పంపడానికి కూడా తోడ్పడుతాయి. యాసిడిటీ సమస్యను తగ్గిస్తాయి. రోజూ ఓ పూట సలాడ్ గా దోసకాయ తింటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

 

అవకాడోలు
వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ. అదే సమయంలో ఆల్కలైన్ లక్షణాలు కూడా అవకాడోలకు ఉన్నాయి. ఇది యాసిడిటీని తగ్గించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు అవకాడోల్లో విటమిన్లు, పొటాషియం వంటి ఖనిజాలవణాలు కూడా ఎక్కువే. మొత్తంగా ఇవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. 

 

ఆకుకూరలు, కూరగాయలు
పాలకూర, కేల్ వంటి ఆకుకూరలు, క్యాబేజీ, బ్రాకొలీ వంటివి కూడా ఆల్కలైన్ లక్షణాలు ఉండేవే. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల యాసిడిటీ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో వాటిలోని పోషకాలు శరీర ఆరోగ్యానికి తోడ్పడుతాయి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

చిలగడ దుంపలు
చిలగడ దుంపల్లోనూ ఆల్కలైన్‌ లక్షణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది యాసిడిటీని తగ్గించడంతోపాటు అల్సర్లు, ఇతర ఇబ్బందుల సమస్యలకు కూడా ఉపశమనం ఇస్తుందని వివరిస్తున్నారు. 

 

అల్లం
శరీరంలో ఇన్‌ ఫ్లమేషన్‌ ను తగ్గించడంలో అల్లం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయంలో యాసిడ్లను నిర్వీర్యం చేసి ఉపశమనం ఇస్తుంది. అదే సమయంలో ఆహారం బాగా జీర్ణం అయ్యేందుకూ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

 

పుచ్చకాయ, తర్బుజా
దోసకాయల తరహాలోనే పుచ్చకాయలు, తర్బూజా వంటివాటిలో కూడా ఆల్కలైన్‌ లక్షణాలు ఉంటాయి. అవి యాసిడిటీతోపాటు అల్సర్లు వంటివాటి ఇబ్బందులను తగ్గించడానికి తోడ్పడుతాయి. 

 

బాదం
డ్రైఫ్రూట్స్ లో భాగమైన బాదం పప్పులు కూడా ఆల్కలైన్ లక్షణాలు ఉన్నవే. ఇవి యాసిడిటీని తగ్గించడంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Acidity #Relief