గాయమైందని 'బ్యాండ్ ఎయిడ్' వేస్తున్నారా? అనారోగ్యానికి వెల్కమ్ చెప్పినట్టు.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

Header Banner

గాయమైందని 'బ్యాండ్ ఎయిడ్' వేస్తున్నారా? అనారోగ్యానికి వెల్కమ్ చెప్పినట్టు.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

  Mon Apr 08, 2024 11:01        Health

శరీరంపై ఏవైనా గాయాలు అయినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ‘బ్యాండ్ ఎయిడ్’.  ఏ చిన్న గాయమైనా వెంటనే దానిని పైన అతికించేస్తారు. అయితే, ఇలా చేయడం ఏమంత మంచిది కాదని, ఇది క్యాన్సర్ కారకమంటూ తాజా అధ్యయనం ఒకటి షాకింగ్ విషయాలు వెల్లడించింది. పీఎఫ్ఏఎస్‌గా పిలిచే పాలీ ఫ్లూరో ఆల్కైల్ సబ్‌స్టాన్సెస్‌ను బ్యాండ్ ఎయిడ్‌లో గుర్తించినట్టు కన్జుమర్ వాచ్‌డాగ్ ‘మమవేషన్’ పేర్కొంది. వాతావరణంలో కరగని పీఎఫ్ఏఎస్‌ వంటి రసాయనాలతో ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నట్టు తెలిపింది. ఈ రసాయనాలు కలిగిన బ్యాండేజీలను గాయాలపై అతికించినప్పుడు అవి మెల్లగా శరీరంలో చేరి కరిగిపోకుండా ఏళ్లపాటు అలానే ఉంటాయని తెలిపింది.

 

ఇంకా చదవండి: ప్రతి రోజూ పప్పు కూర తింటున్నారా..? అయితే కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సింది!!

 

తద్వారా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని వివరించింది. పీఎఫ్ఏఎస్‌ రసాయనాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు, టీకాల ఫలితాలను కూడా తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. బాలల గ్రహణశక్తి, శారీరక, మానసిక వికాశంపైనా ప్రభావం చూపిస్తాయని తెలిపారు. హార్మోనల్ సమస్యలతోపాటు కొన్ని రకాల కేన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందని వివరించారు. పీఎఫ్ఏఎస్ రసాయనాలకు వాటర్‌ప్రూఫ్ లక్షణాలు ఉండడం, వేడి, గ్రీజు, ఆయిల్, నీరు వంటి వాటిని తట్టుకునే శక్తి ఉండడంతో వీటిని బ్యాండేజ్‌లలో వాడతారు.  అడెహెసివ్స్‌, నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌, ఫుడ్‌ ప్యాకేజింగ్‌లలోనూ ఈ రసాయనాలు కనిపిస్తాయి.  ప్రపంచవ్యాప్తంగా 18 బ్రాండ్లకు చెందిన 40 బ్యాండేజీలను పరిశీలించగా వాటిలో 26 బ్యాండేజీల్లో ఈ రసాయనాలు కనిపించినట్టు అధ్యయనం పేర్కొంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

 

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

 

ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!

 

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..

 

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

 

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

 

ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

 

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. మహిళ వాట్సాప్ స్టేటస్!! ఇక నుంచి భర్తల అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Band-Aid #Cancer #PFAS #MamavationLaboratory #Bandages #Health