బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

Header Banner

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

  Mon Oct 07, 2024 12:49        Others

విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెలలోనే అరేబియాలో ఒకటి, బంగాళాఖాతంలో  రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి  ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని  భావిస్తున్నారు. ఆదివారం తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు,  నంద్యాల, ఎన్టీఆర్, అనకాపల్లి, కర్నూలు తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాత్రి 7 గంటల  వరకు అత్యధికంగా రాజమహేంద్రవరంలో 53 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు  రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. కావలిలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత  37.6 డిగ్రీలుగా నమోదైంది. విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ,  కావలి, నెల్లూరు, కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం  కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 




   #andhrapravasi #vizag #rainalert #bangalakatham #heavurains #westgodavari #eluru #ananthapuram #sripottisriramulu #todaynews #flashnews #latestupdate