633 మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి!

Header Banner

633 మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి!

  Tue Jul 30, 2024 07:50        India, World

NRI Indian Students: విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లు తెలిపారు. ప్రమాదాలు, వైద్య పరిస్థితులు, దాడులు వంటి కారణాల వల్ల 2019 నుంచి 41 దేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థులు చనిపోయినట్లు చెప్పారు. కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కెనడాలో అత్యధికంగా 172 మంది భారతీయ విద్యార్థుల మరణించారు.

 

ఇంకా చదవండి: అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది భారతీయులు! ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా..

 

ఆ తర్వాత 108 మరణాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. బ్రిటన్‌లో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్‌లో ఒక భారతీయ విద్యార్థి మరణాలు నమోదయ్యాయి. మరోవైపు విదేశాల్లో జరిగిన దాడుల్లో 19 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కెనడాలో జరిగిన దాడుల్లో అత్యధికంగా తొమ్మిది మంది, అమెరికాలో ఆరుగురు మరణించారు. ఆస్ట్రేలియా, చైనా, బ్రిటన్‌, కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన దాడుల్లో ఒక్కరు చొప్పున ఇండియన్‌ స్టూడెంట్స్‌ చనిపోయారు. గత మూడేళ్లలో 48 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి బహిష్కరించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. వారి బహిష్కరణకు గల కారణాలను అమెరికా అధికారులు అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. అయితే విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గన్నవరం నుంచి దేశంలోని పలుచోట్లకు విమానాలు! కేశినేని చిన్ని వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి!

 

మీ శరీరంలో అణువణువు పిరికితనమే! అసెంబ్లీకి వెళ్లి పోరాడడం మీకు చేతకాదు! అలాంటి ద్వేషం మాకు లేదు - జగన్ పై షర్మిల ఫైర్!

 

అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది భారతీయులు! ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా..

 

ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!

 

వైసీపీ మళ్ళీ వస్తుందో రాదో కానీ మనవాళ్లే వచ్చేవరకు నిద్రపోయేలా లేరుగా! రాజకీయం అంటే ఏంటీ సార్? సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలులో కీలక పరిణామం! సీఏం చంద్రబాబు తుది నిర్ణయం!

 

11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..

 

గోదావరిలో యువకుడి గల్లంతు.. 5 లక్షల సాయం ప్రకటించిన సీఎం! వరద ఉధృతి తగ్గేంత వరకు!

 

రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!

 

రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన ఘనుడు! అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా! మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఘన నివాళులు!

 

పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు!​ అతిథులను అలరించనున్న మన్యం పంట!

 

ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!

 

ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!

 

నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #World #USA #kenada #IndianStudents #Dead